హీరోయిన్ తో బైక్ పై షికారుకెళ్ళిన మంత్రి ...ఎక్కడికి వెళ్లాడంటే !
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అతి ముఖ్యమైన సమస్యలలో ట్రాఫిక్ సమస్య కూడా ఒకటి. రోజురోజుకి నగర జనాభా పెరిగిపోతుండటం , వాటికీ తగ్గట్టుగా వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ జరిగే ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతూనే వస్తుంది. వాహనాలని నడిపే వారు ట్రాఫిక్ రూల్స్ ని సరిగ్గా పాటించకుండా ఇష్టం వచ్చినట్టు వాహనాల్ని డ్రైవ్ చేస్తుండటంతో ఈ ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇదే విషయాన్నీ తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలని నడిపితే ఎవరికీ ఎటువంటి ప్రమాదాలు జరగవు అని అన్నారు. రూల్స్ పాటించకే యాక్సిడెంట్లు ఎక్కువ గా జరుగుతున్నాయి అని అన్నారు.
ఇకపోతే ఈ నెల 27 నుండి వచ్చే నెల 2 వ తేదీవరకు వరకు నిర్వహించనున్న రోడ్డు భద్రతా వారోత్సవాలను మంత్రి అజయ్ సోమవారం హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హెల్మెట్ పెట్టుకొని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని నడిపారు. ఆయన వెనుక హీరోయిన్ ఈషా రెబ్బా కూర్చున్నారు. కార్యక్రమం లో సీఎస్ సోమేశ్ కుమార్, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణ ప్రసాద్, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.