ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ - జగన్ లు అన్నాదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణమే ఉంది. కానీ కరోనా దెబ్బకు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రావాసులను ఆ రాష్ట్రానికి పంపే విషయంలో ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. అది సద్దుమణగకముందే మరో ఉపద్రవం వచ్చేసింది. నల్గొండ జిల్లాలోని ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని దామరచెర్ల వద్ద మరో శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. పోలీసు సూపరింటెండెంట్ ఎ వి రంగనాథ్ నేతృత్వంలోని జిల్లా పోలీసుల సకాలంలో జోక్యం చేసుకోవడంతో ఇరు రాష్ట్రాల మధ్య పెద్ద ఘర్షణ తప్పింది.
గత 40 రోజులుగా తెలంగాణలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వందలాది మంది వలస కూలీలు తమ సొంత వాహనాల్లో దామరచర్లకు., మరికొందరు కాలినడకన తమ సొంత ప్రాంతాలకు వెళ్లడానికి ఆంధ్రా--తెలంగాణ సరిహద్దుకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా వలస కూలీలు వెళ్లిపోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్త తెలుసుకున్న తరువాత వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లడానికి ఆంధ్రా సరిహద్దుకు చేరుకున్నారు.
అయితే ఆంధ్రపదేశ్ పోలీసులు తమ రాష్ట్రంలోకి ప్రవేశించడానికి వారి రాష్ట్రాలకే చెందిన వలస కూలీలకు అనుమతించలేదు. కరోనా భయంతో వీరిని అక్కడే ఆపేశారు. శనివారం ఉదయం నుండి చెక్ పోస్ట్ వద్ద వలస కూలీలు చిక్కుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ పోలీసులు తెలంగాణ రెవెన్యూ అధికారులు - పోలీసులతో సంప్రదింపులు జరిపి వారి లిస్టును - ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వలస కార్మికుల జాబితాలో చేర్చాలని కోరారు. స్వయంగా వచ్చిన కార్మికులను ప్రవేశించడానికి అనుమతించమని - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో వచ్చిన వారికి మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంటుందని ఆంధ్ర పోలీసులు స్పష్టం చేశారు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వలస కార్మికులు ఆందోళనకు దిగారు. పరిస్థితి హింసాత్మకంగా మారి ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. అయితే నల్గొండ ఎస్పీ రంగనాథ్ అక్కడికి వెళ్లి ఏపీ రాష్ట్రంలోని ఉన్నతాధికారులతో మాట్లాడారు.
తరువాత, రాష్ట్ర సరిహద్దు వద్ద చిక్కుకున్న 100 మంది వలస కూలీలకు వారి స్వస్థలాలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశాడు. వలస కార్మికులతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి నల్గోండ జిల్లా పోలీసులు చెక్ పోస్ట్ వద్ద ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు.పగటిపూట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో దాదాపు 200 మంది వలస కూలీలు తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ వెళ్లారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని చెక్ పోస్ట్ పోలీసు సిబ్బందికి రంగనాథ్ ఆదేశించారు.