ప్రముఖ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం.. సీసీటీవీకి చిక్కిన దొంగలు
హైదరాబాద్ లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం జరిగినట్టు సమాచారం. కుమ్మరి గూడ ముత్యాలమ్మ గుడిలో దుండగులు చొరబడి నగదును ఎత్తుకెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుస్తోంది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉదయం గుడికి వచ్చిన పూజారి ఆలయ తలుపుకి వేసిన తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా.. హుండీ తాళం కూడా పగులగొట్టి ఉండటాన్ని గమనించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాడు. గత ఏడాది చాంద్రాయణగుట్ట పరిధిలోని లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో కూడా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు చొరబడి చోరీకి ప్రయత్నించారు. గుడిలో హుండీ తాళాలు పగులగొట్టి నగదు దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు.హైదరాబాద్ లో వరుస దొంగతనాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. దొంగలను సీసీటీవీ , ఫింగర్ ఫ్రింట్స్ ద్వారా దర్యాప్తు జరుపుతున్నారు.