వర్క్​ ఫ్రం హోం పర్మినెంట్​ అట..మైక్రోసాఫ్ట్​ సంచలన నిర్ణయం

Update: 2020-10-10 06:30 GMT
ప్రముఖ సాఫ్ట్​వేర్​ కంపెనీ మైక్రోసాఫ్ట్​ సంచలన నిర్ణయం తీసుకుంది.  తన కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పర్మినెంట్​ వర్క్​ఫ్రంహోం అవకాశం కల్పించింది. కరోనా వచ్చినప్పటి నుంచే మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇంటినుంచే పనిచేస్తున్నారు. వర్కఫ్రంహోం కోసం హైబ్రిడ్​వర్క్​ప్లస్​ అనే గైడెన్స్ ఆవిష్కరించింది. దీని ద్వారా ఉద్యోగులు సులువుగా, వర్క్​ఫ్రంహోం సులువుగా చేస్తున్నారు.  మైక్రోసాఫ్ట్ ఇంటర్నల్ గైడెన్స్ ప్రకారం.. అమెరికాలో ఆఫీసులన్నీ రీ ఓపెన్ అయ్యేంతవరకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు పర్మినెంట్ గా ఇంట్లో నుంచే పనిచేయనున్నారు. భవిష్యత్తులోనూ కంపెనీ ఫ్లెక్సిబల్ వర్కింగ్ ప్లాన్ల కోసం ఈ గైడెన్స్ మైక్రోసాఫ్ట్ రూపొందించింది. మేనేజర్లు కూడా పర్మినెంట్ రిమోట్ వర్క్  చేసేందుకు సంస్థ అనుమతిచ్చింది. వర్క్​ఫ్రంహోం ఆప్షన్​ కు ఎంచుకున్నవారు తమకు కేటాయించిన కార్యాలాయాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది.

మైక్రోసాఫ్ట్ ఆఫీసులో అందుబాటులో ఉన్న టచ్ డౌన్ స్పేస్ వాడుకునేందుకు ఆప్షన్లు ఇచ్చింది. 50 శాతం కన్నా తక్కువ మంది ఇంట్లో నుంచి పనిచేసే ఆప్షన్ ఎంచుకునే అవకాశం మైక్రోసాఫ్ట్.  కల్పించింది. అయితే కంపెనీకి చెందిన కొన్ని విభాగాలు మాత్రం కచ్చితంగా ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. హార్డ్ వేర్ ల్యాబ్స్, డేటా సెంటర్లు, ట్రైనింగ్ సెక్షన్ రోల్స్ ఉద్యోగులు తప్పకుండా ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. వర్క్​ఫ్రం ఎంచుకున్న ఉద్యోగులు ఎక్కడి నుంచైనా పనిచేయవచ్చు.  కంపెనీ సొంత జియోపే స్కేల్ ఆధారంగా ఉద్యోగులకు పరిహారం, ప్రయోజనాలు అందించనుంది. ఇంట్లో నుంచి పర్మినెంట్ రీమోట్ వర్క్ ఉద్యోగులకు అయ్యే ఖర్చులను కూడా మైక్రోసాఫ్ట్ భరించనుంది. మేనేజర్ల అనుమతి లేకుండా తమకు అనుకూలంగా ఉన్న పనివేళల్లో పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్​అవకాశం కల్పించింది.
Tags:    

Similar News