మోదీ చేసిన ఏర్పాట్లుకు మురిసిపోతున్న మెలానియా

Update: 2020-02-28 09:00 GMT
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ దంపతులు భారత్ నుంచి వెళ్లిపోయి రెండు రోజులవుతున్నా ఇంకా ఇక్కడి జ్ఞాపకాలు వారిని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ వారికి లభించిన అపూర్వ స్వాగతం, మర్యాదలు ఆకట్టుకున్నాయి. ట్రంప్ తన ప్రసంగంలోనే ఇదంతా చెప్పగా ఆయన భార్య మెలానియా ఇక్కడ మోదీ చేసిన ఏర్పాట్లు ఎంతగా ఇంప్రెస్ అయ్యారో ఆమె సోషల్ మీడియా పోస్టులే చెబుతున్నాయి. మెలానియాయే కాదు ఇవాంకా సైతం ఇంకా భారత్‌నే స్మరిస్తున్నారు.

అహ్మదాబాద్‌లో స్వాగతం అయితేనేమి.. తాజ్ మహాల్ వద్ద చిత్రాలైతేనేమి మెలానియా, ఇవాంకాలు  ఇంకా అవే షేర్ చేస్తున్నారు. ఇక మెలానియా అయితే.. దిల్లీలోని సర్వోదయ స్కూల్‌ను సందర్శించినప్పుడు అక్కడ హ్యాపీనెస్‌ తరగతులకు హాజరయ్యాు. అక్కడ చిన్నారుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. విద్యార్థులతో తాను గడిపిన మధుర క్షణాలను ప్రథమ మహిళ ఇంకా ఆస్వాదిస్తున్నారు. అమెరికాకు తిరిగి వెళ్లినా ఆ జ్ఞాపకాల్ని మెలానియా మరచిలేకపోతున్నారు. మెలానియా నిర్వహిస్తున్న ‘బీ బెస్ట్‌’ స్వచ్ఛంద కార్యక్రమ లక్ష్యాలకు హ్యాపీనెస్‌ తరగతుల ఆశయం దగ్గరగా ఉండడం ఆమెని మరింత ఆకట్టుకుంది. దీని పై గురువారం ట్విట్టర్ వేదిక గా మరోసారి తన ఆనందాన్ని మెలానియా పంచుకున్నారు.

భారతీయ సంప్రదాయం లో తనకు స్వాగతం పలికినందుకు పాఠశాలకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె అక్కడ చిన్నారులతో గడిపిన క్షణాలు చిరస్మరణీయంగా మిగిలి పోతాయంటూ పిల్లలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ‘భారత సంప్రదాయ పద్ధతి లో నుదుట తిలకం దిద్ది, హారతి ద్వారా నాకు స్వాగతం పలికినందుకు సర్వోదయ పాఠశాలకు కృతజ్ఞతలు. అద్భుత ప్రతిభ కలిగిన విద్యార్థులు, బోధనా సిబ్బంది మధ్య ఉండే అవకాశం రావడం గౌరవం గా భావిస్తున్నాను. పాఠశాలలో గడిపిన క్షణాలన్నీ చిరస్మరణీయం’ అంటూ మెలానియా సర్వోదయ పాఠశాల సందర్శనను గుర్తుచేసుకున్నారు.
Tags:    

Similar News