ఎయిర్ టెల్ ప్రపంచంలోనే నెంబర్ 2

వావ్ ఎయిర్ టెల్ అనాల్సిన టైం వచ్చేసింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం దేశీయ దిగ్గజ ఇంటర్నెట్ సంస్థ ఎయిర్ టెల్ తనకు తిరుగులేదన్న విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది.;

Update: 2026-04-03 03:34 GMT

వావ్ ఎయిర్ టెల్ అనాల్సిన టైం వచ్చేసింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం దేశీయ దిగ్గజ ఇంటర్నెట్ సంస్థ ఎయిర్ టెల్ తనకు తిరుగులేదన్న విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది. అంతర్జాతీయంగా 65 కోట్ల మందికి పైనే.. చందాదారులతో అతి పెద్ద టెలికాం సేవల సంస్థగా నిలిచింది. 2026 సంవత్సరం నాటి గణాంకాల విషయంలో ఎయిర్ టెల్ ఈ గౌరవాన్ని సొంతం చేసుకుంది

ఇదే విషయాన్ని భారతీ ఎయిర్ టెల్ తెలిపింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. భారతదేశంలో విస్త్రత స్థాయిలో సేవలు అందించే ఎయిర్ టెల్.. ఆఫ్రికాలోనూ టెలికాం సంస్థలకు సేవలు అందిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వెల్లడైన జీఎస్ఎంసీ ఇంటెలిజెన్స్ గణాంకాల ప్రకారం.. చందాదార్ల సంఖ్య పరంగా ప్రపంచంలోనే రెండో అత్యధిక సంస్థగా ఎయిర్ టెల్ అవతరించింది.

తాజాగా విడుదలైన గణాంకాల్ని చూస్తే.. మార్చి 31 నాటికి భారత్ లో 46.4 కోట్ల మంది మొబైల్.. ఐఓటీ 6.7 కోట్లు.. బ్రాడ్ బ్యాండ్ 1.4 కోట్లు.. డిజిటల్ టీవీ 1.6 కోట్లు.. ఆఫ్రికాలోని పద్నాలుగు దేశాల్లో కలిపి 17.9 కోట్ల మందికి పైనే చందాదారులు ఎయిర్ టెల్ కు ఉన్నారు. చందాదార్ల సంఖ్యను చూస్తే.. చైనా మొబైల్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలో చందాదార్ల సంఖ్య పరంగా చైనా మొబైల్ అగ్రస్థానంలో ఉన్నట్లుగా రిపోర్టు వెల్లడించింది. అదే సమయంలో డ్రాగన్ దేశంలో చైనా అగ్రస్థానంలో ఉందని చెబుతున్నారు. ఈ చైనా సంస్థకు 100 కోట్ల చందాదార్లు ఉన్నట్లుగా వెల్లడైంది.

అంతేకాదు.. 2026 ఫిబ్రవరిలో ఎయిర్ టెల్ ఏకంగా 48.6 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకుంది. ఇది రిలయన్స్ జియో కంటే చాలా ఎక్కువ కావటం గమనార్హం. జియో కొత్త కస్టమర్లు 16.2 లక్షలుగా చెబుతున్నారు. కేవలం మొబైల్ మాత్రమే కాదు.. దేశీయంగా 1.3 కోట్ల ఇళ్లకు హై స్పీడ్ ఇంటర్నెట్.. 1.5 కోట్ల మందికి డిజిటల్ టీవీ సేవల్ని అందిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. 2026 నాటికి ఎయిర్ టెల్ బ్రాండ్ విలువ 6 శాతం పెరిగి 8.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లుగా నివేదిక వెల్లడించింది.ప్రపంచంలో అత్యంత విలువైన టెలికాం బ్రాండ్లలో 17వ స్థానాన్ని ఎయిర్ టెల్ సొంతం చేసుకుంది. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. ఆఫ్రికాలో ‘ఎయిర్ టెల్ మనీ’ ద్వారా సుమారు 5.2 కోట్ల మంది ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొంది. అంతకంతకూ కస్టమర్లను పెంచుకోవటమే కాదు.. సరికొత్త టెక్నాలజీలను.. విభిన్నమైన సేవల్ని ఎయిర్ టెల్ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటుందని చెప్పాలి.

Tags:    

Similar News