మీడియాపై దావా.. హ్యారీ భార్యకు రూ.వంద పరిహారం

Update: 2022-01-06 23:30 GMT
రూపాయి అయినా.. పందెం పందెమే.. గెలిచామా? ఓడామా? అనేది ఇక్కడ ముఖ్యం. ఇలాంటి న్యాయమే కోర్టుల నుంచి దక్కితే ఆ పందెం గెలుపునకు మరింత సాధికారత. ఇప్పుడిదే ఆనందంతో ఉన్నారు బ్రిటిష్ యువరాణి కాదు..కాదు.. మిస్ అయిన యువరాణి మేఘన్ మార్కెల్. బ్రిటన్ యువరాజు భార్య అయిన ఈమె మీడియాపై పరువు నష్టం దావా వేసి.. ఒక్క పౌండు పరిహారం గెలుచుకున్నారు. పౌండు అంటే భారత కరెన్సీలో ప్రస్తుతం వంద రూపాయిల 63 పైసలు.

ఇదెలా జరిగిందంటే..మేఘన్ తండ్రికి రాసిన లేఖను మీడియా ప్రచురించింది. ఈ పని చేసింది కూడా సాదాసీదా మీడియా సంస్థ కాదు. ప్రసిద్ధ అసోసియేటెడ్ ప్రెస్‌ (ఏపీ). అయినా మేఘన్ వెరవకుండా తన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటల్లిందంటూ ఆమె కోర్టుకెక్కారు. ఇప్పటికే రాజ కుటుంబంలో అవమానాలతో బయటకు వచ్నిన.. రాజరికం ఓ ముళ్ల కిరీటం వంటిందని ఆరోపిస్తూ మేఘన్ -హ్యారీ దంపతులు అమెరికాలో సాధారణ జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వారసుడిగా గుర్తింపు పొందిన హ్యరీ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదంతా వదిలేస్తే.. వ్యక్తిగత గోప్యతకు భంగం కేసులో మేఘన్ వేసిన దావాకు కింది కోర్టు నుంచి గతంలో అనుకూలంగా తీర్పు వచ్చింది. 30 వేల పౌండ్లు నష్టపరిహారం చెల్లించాలని ఆ తీర్పులో కోర్టు చెప్పింది. కానీ అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) యూకే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కోర్టులోనూ మేఘన్‌కు ఆమెకు అనుకూలంగా తీర్పును వెలువరించినా.. కింది కోర్టు విధించిన జరిమానాను మాత్రం బాగా తగ్గించింది.

పౌండు పరిహారమూ.. విరాళానికే.. పరిహారం కింద కేవలం ఒక్క పౌండు మాత్రమే చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించడం గమనార్హం. ఆమె అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం కాపీరైట్ ఉల్లంఘన కిందే వస్తుందని, అసోసియేటెడ్ ప్రెస్ ఒక్క పౌండును చెల్లించాలని సూచించింది. కాగా, తీర్పుపై రాజకుంటుం అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. కాపీరైట్ ఉల్లంఘన తీవ్రమైందని, ఈ జరిమానాను స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందజేయనున్నట్టు తెలిపారు. కోర్టు ఆఫ్ అప్పీల్ గతంలో ఇచ్చిన తీర్పు వివరాలను ఏపీ తరఫున లాయర్లు బుధవారం వెల్లడించారు. చట్టపరమైన ఖర్చుల కోసం మార్కెల్‌కు 30,000 పౌడ్‌లను చెల్లించాలని పేర్కొందని, దీనిపై అసోసియేటెడ్ ప్రెస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిందని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి పూర్తి విచారణ లేకుండానే మేఘన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారని వివరించారు.

తప్పు ఒప్పుకొన్న అసోసియేటెడ్ ప్రెస్ తాజా తీర్పుతో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ కేసులో ఓటమిని ఏపీ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మేఘన్ తన తండ్రికి 2019లో రాసిన లేఖను ప్రచురించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసోసియేటెడ్ ప్రెస్‌పై దావా వేశారు. లేఖ లీక్ అయ్యే అవకాశం ఉందని తెలిసి కూడా మార్కెల్ రాశారని ఏపీ తరఫున లాయర్లు వాదించారు. మరోవైపు రాజకుటుంబంలో ఉన్న కొద్ది రోజులు తనకు ఎదురైన అవమానాలు, సంఘటనలను బయోగ్రఫీ రూపంలో తీసుకొచ్చేందుకు మాజీ సహాయకుడిని అనుమతించినట్టు మేఘన్ అంగీకరించారు. ఈ అంశాన్ని గతంలో నిరాకరించినా చివరకు కోర్టుకు క్షమాపణలు చెప్పారు.
Tags:    

Similar News