మరో సీఎం కి కరోనా పాజిటివ్ !

Update: 2020-12-11 11:36 GMT
కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా కలవరాన్ని సృష్టిస్తోంది. ఏ కొద్దిపాటి లక్షణాలు ఉన్నా కరోనా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మంత్రులు, రాజకీయ నేతలు సైతం కరోనా బారినపడుతున్నారు.ఇక తాజాగా మేఘాలయ సిఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో సంగ్మా కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఈ కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది.

తనకు కరోనా సోకినట్టు కాన్రాడ్ సంగ్మాకు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనలో స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, హోంఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు, తనతో కాంటాక్టులో ఉన్నవారు విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ తేలితే చికిత్స చేయించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. రోడ్ల మీదకు వచ్చినప్పుడు విధిగా రెండు గజాల సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు దరించాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు.
Tags:    

Similar News