మోడీ ఏపీకి ఎంత చెప్పారు.....ఎంత చేసారు
మీడియా తలుచుకుంటే ఏమైనా చేయగలదని కొందరు నమ్మకంగా చెబుతుంటారు.మరికొందరేమో.. అదంతా ఉత్త మాటగా కొట్టి పారేస్తారు. రంగుటద్దాల్ని పెట్టుకోకుండా.. విషయాల్ని విషయాలుగా చూస్తూ.. ప్రజల శ్రేయస్సు.. మనమున్న ప్రాంత ప్రయోజనాల్నిపరిగణలోకి తీసుకొని.. సాపేక్షంగా మాట్లాడాల్సిన అవరం ఉంది. ఏపీకి మోడీ సర్కారు ఏమీ చేయలేదన్న ప్రచారం మొదలై.. ప్రత్యేక హోదా కోసం డిమాండ్ పెరుగుతున్న వేళ.. కేంద్రమంత్రి.. తెలుగువాడైన వెంకయ్య నాయుడు రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది. తన అనుకూల మీడియాను ఆయన రంగంలోకి దించిన వైనం ఈ రోజు పత్రికల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏపీకి తమ సర్కారు ఎంతో చేసిందని.. ఏపీకి ప్రత్యేకహోదా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నట్లుగా వెంకయ్య మాటని ప్రముఖంగా ప్రస్తావించటమే కాదు.. భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
గడిచిన రెండున్నరేళ్లుగా ఏపీకి మోడీ సర్కారు ఏం చేసిందన్న భారీ జాబితాను ప్రకటించేసిన కొన్ని మీడియా సంస్థల తీరు చూస్తే నవ్వాల్లో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే.. అభివృద్ధి అంటే.. ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసి.. అది ప్రజలకు ఉపయోగపడటం.. వాటి ఫలాలు వారికి అందినప్పుడే. కానీ.. కాగితాల్లో ఉన్న వాటిని.. చర్చల్లో ఉన్న వాటిని.. కాగితాల మీద ఆమోదముద్ర పడిన వాటిని చెప్పుకొస్తూ.. తామేదో పీకేసినట్లుగా ప్రచారం షురూ చేయటం చూస్తుంటే.. ఏపీ ప్రజలు మరింత క్లారిటీతో ఉండాల్సిన సమయం వచ్చేసిందని చెప్పాలి.
విభజన అనంతరం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఏపీని మోడీ సర్కారు ప్రత్యేకంగా చూసిందని.. ఇందులో భాగంగా ఎన్నో ప్రాజెక్టులను ఏపీకి కేటాయించినట్లుగా లిస్టు చెప్పిన వాటిని నిశితంగా పరిశీలిస్తే.. వాటిల్లో చాలా వరకు ప్రతిపాదన దశలో ఉన్నవి కావటం.. ఓకే అన్న ఆమోదముద్ర పడటం మినహా మరింకేమీ ఉండవన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. మోడీకి.. కేంద్రమంత్రి వెంకయ్యకు దన్నుగా నిలిచేలా మొదలైన ఈ ప్రచార ఉచ్చులో సగటు ఆంధ్రోడు పడకుండా.. తర్కబద్ధంగా ఆలోచించాల్సిన అవసరం వచ్చిందని చెప్పాలి. లేనిపక్షంలో ప్రచార హోరులో పడిపోవటం.. వావ్ అనుకొని భ్రమల్లో బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకీ.. రెండున్నరేళ్ల వ్యవధిలో ఏపీకి మోడీ సర్కారు ఏం చేసిందో చెప్పే భారీ లెక్కను చూడటంతో పాటు.. వాటిని తర్కబద్ధంగా ప్రశ్నిస్తే..
= ఐఐటీ-తిరుపతి.. ఐఐఎం-విశాఖ.. ఐఐఎస్‌ఈఆర్-తిరుపతి.. ఐఐఐటీ-చిత్తూరు జిల్లా.. ఎన్ ఐటీ-తాడేపల్లిగూడెం.. ఎస్ పీఏ-విజయవాడ.. ఎయిమ్స్-మంగళగిరి.. వ్యవసాయ విశ్వవిద్యాలయం- గుంటూరు జిల్లా
(వీటిల్లో ఎన్నింటికి శాశ్విత భవనాలు. పక్కా ఏర్పాట్లు.. సిబ్బంది పూర్తి అయ్యాయి?)
= ఎన్ సీఈఆర్‌టీ ప్రాంతీయ కేంద్రం(నెల్లూరు).. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (విజయవాడ).. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ నార్కోటక్స్ (అనంతపురం జిల్లా).. నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ (నెల్లూరు జిల్లా).. మెంటల్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్(నెల్లూరు)
(కాగితాల మీద ఉన్నవి సరే.. వీటి ఏర్పాట్లు.. ఇందుకోసం పెట్టిన ఖర్చు లెక్కేంటి?)
= పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా. ఏడు ముంపు మండలాలు రాష్ట్రంలో కలపటం. నాబార్డు ద్వారా నిధుల కేటాయింపు.
(విభజన చట్టంలో ఉన్నది చేసినా ఏపీకి ప్రత్యేకంగా చేసినట్లేనా?)
= అనంతపురం - కడప - కర్నూలుల నుంచి అమరావతికి నాలుగు - ఆరు వరసల జాతీయ రహదారి - అమరావతికి బాహ్య వలయ రహదారి మంజూరు.
(ఇప్పటివరకూ కేటాయించిన నిధులు ఎంత? ఎప్పటికి పూర్తి అవుతుంది? దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇదే తీరులో రహదారులు మంజూరు చేశారా? లేరా?)
= 2,500 మెగావాట్ల రెండు సౌర విద్యుత్తు పార్కులు.. గ్రీన్ ట్రాన్స్ మిషన్ కారిడార్ మంజూరు. . గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ద్వారా రూ.328కోట్లు మంజూరు
(వీటిల్లో ఎన్నింటి పనులు మొదలయ్యాయి? వాటి ముచ్చట ఏంది?)
= వాజ్ పేయి హయాంలో ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైల్వేలైన్ మంజూరైతే.. తర్వాతి పనులు చాలా నెమ్మదిగా జరిగాయి. త్వరితగతిన పూర్తయ్యేలా నిధుల కేటాయింపు.
(డెడ్ లైన్ చెప్పటంతో పాటు.. గడిచిన రెండున్నరేళ్లలో జరిగిన పని మాటేమిటి?అన్నది చెప్పరే. వాజ్ పేయ్ హయాంలో మొదలైన ఈప్రాజెక్టు తర్వాతి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయనే అనుకుందాం. మరి.. గడిచిన రెండున్నరేళ్ల కాలంలో ఏపీకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే మోడీ సర్కారు ఎందుకు పూర్తి చేయనట్లు?)
= నంద్యాల-ఎర్రగుంట్ల మార్గం పూర్తి
(ఎవరి హయాంలో ఈ పనులు మొదలయ్యాయి. మోడీ సర్కారు వచ్చిన రెండున్నరేళ్లలో కేటాయించిన మొత్తం ఎంత?)
= నెల్లూరుకు లెదర్ పార్క్ మంజూరైతే.. దానికి కేటాయించిన స్థలంలో నిర్మించొద్దని ఆందోళన చేస్తున్నారు. పనులు జాప్యమవుతున్నాయి.
(నిజంగానే అభివృద్ధి అయితే ప్రజలు అడ్డుకోరు కదా? స్వార్థంతో రాజకీయ పక్షాలు వ్యవహరిస్తే ప్రజలే అడ్డుకుంటారు కదా?)
= గుంటూరుకు స్పైసెస్ పార్క్.. విశాఖలో మెడిపార్క్. రూ.20వేల కోట్ల పెట్టుబడులొచ్చే అవకాశం.. విశాఖలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా - సమీర్ - నైపర్ సంస్థల ఏర్పాటు. . భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అనంతపురంలో మిస్సైల్ తయారీ కేంద్రం.. నిమ్మకూరులో రాత్రిపూట చూడగలిగే కళ్లజోళ్ల తయారీ కేంద్రం మంజూరు.. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నావికాదళ ఎయిర్‌స్టేషన్.. కృష్ణాజిల్లా నాగాయలంకలో క్షిపణి పరీక్షా కేంద్రం.. కర్నూలులో ఓపెన్ ఎయిర్ రేంజ్ ఎవాల్యువేషన్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన.. చిత్తూరు జిల్లాలో ట్రూప్స్ శిక్షణ కేంద్రం.
(ఇప్పుడు ప్రస్తావించిన చాలా అంశాలు యూపీఏ హయాం నుంచి కాగితాల మీదన ఉన్నవన్న విషయాన్ని మర్చిపోకూడదు. గడిచిన రెండున్నరేళ్లలో ప్రతిపాదనల స్థాయినుంచి మంజూరు వరకూ వెళ్లటమే జరిగింది తప్పించి.. నిధులు కేటాయించి పనులు మొదలు కాలేదని చెప్పాలి.కొన్ని ప్రాజెక్టులు అయితే ప్రతిపాదనల స్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని వారే చెబుతుండటం గమనార్హం)
= విశాఖలో ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య కళాశాల.. విశాఖలో పెట్రోలియం యూనివర్శిటీ.. విశాఖ-కాకినాడ నడుమ పెట్రో కారిడార్.. అంతర్వేదిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్.. కాకినాడ సమీప హోప్ ద్వీపాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయటం..నెల్లూరు కోస్తా తీర పర్యాటక అభివృద్ధి.. నెల్లూరు, గుంటూరుల్లో క్యాన్సర్ పరిశోధనా కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదన.. కాకినాడలో విదేశీ వాణిజ్య సంస్థ ఏర్పాటు ప్రతిపాదన
(ఇప్పుడు చెప్పిన వాటిల్లో చాలావరకూ ప్రతిపాదన స్థాయిలోనే ఉండటం మర్చిపోకూడదు. అలాంటప్పుడు రెండున్నరేళ్ల వ్యవధిలో చాలా పీకేసినట్లుగా మాట్లాడకూడదు కదా?)
= గన్నవరంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు.
(ఏర్పాటు చేయటం అంటే ఏమిటో వెంకయ్య అండ్ కోలు మరింత స్పష్టం ఇస్తే.. జరిగిన దానిపై మరింత అవగాహన పెరుగుతుందని చెప్పొచ్చు)
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/