ఏసీబీకి మత్తయ్య అలా మెసేజ్ పెట్టాడా?

Update: 2015-08-18 05:37 GMT
ఓటుకు నోటు కేసులో ఏ4గా ఉన్న జెరుసలెం మత్తయ్య మరోసారి వార్తల్లోకి వచ్చారు. తాజాగా ఏసీబీ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో అతనికి సంబంధించిన ఒక ఆసక్తికర వ్యవహారాన్ని నమోదు చేయటం కనిపిస్తుంది. ఓటుకు నోటు కేసు బయటకు వచ్చిన సమయంలో హైదరాబాద్ లోనే ఉన్న అతను.. ఆ తర్వాత ఏపీకి వెళ్లిపోవటం.. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి పేరును ఈ కేసు విచారణలో చెప్పాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నట్లుగా చెప్పటం తెలిసిందే.

ఇదే విధంగా విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేయటం కూడా తెలిసిందే. అయితే.. మత్తయ్య నుంచి తమకో ఫోన్ సందేశం వచ్చినట్లుగా తెలంగాణ ఏసీబీ పేర్కొంటోంది. జూన్ రెండో తారీఖున తమకు పంపిన ఎస్ ఎంఎస్ లో తనను టీడీపీ నేతలు తన ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయమన్నారని.. తాను జూన్ 3 ఉదయం ఫోన్ చేస్తానని చెప్పారని.. అంతేకాదు.. బెయిల్ ఖర్చులకు డబ్బులు చూసుకోవాలన్న మాటను ఎస్ ఎంఎస్ లో పేర్కొన్నారంటూ ఛార్జ్ షీట్ లో తెలపటం గమనార్హం.

మరి.. టీ ఏసీబీ అదికారులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్న విధంగా మత్తయ్య నుంచి అలాంటి ఎస్ ఎంఎస్ వెళ్లిందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. తనకు ఆశ్రయం ఇచ్చిన టీడీపీ నేతల గురించి.. వారిని బుక్ చేసేలా మేసేజ్ పెట్టే ఛాన్స్ ఉందా? అన్నది ఇప్పుడో ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News