తెలంగాణలో బంగారం.. వజ్రాల నిల్వల కోసం భారీగా అన్వేషణ

Update: 2020-09-23 00:30 GMT
ఇప్పటివరకు ఎప్పుడు వినని విధంగా బంగారు.. వజ్రాల నిక్షేపాల కోసం అన్వేషణ సాగుతోందా? అంటే అవునన్న మాట తాజాగా బయటకు వచ్చింది. గడిచిన కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బంగారు.. వజ్రాలకు సంబంధించిన అన్వేషణ్ సాగుతున్న వైనాన్ని తాజాగా కేంద్రం వెల్లడించింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు తాజాగా కేంద్ర గనుల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.

కేంద్ర గనుల శాఖ అధ్వర్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో బంగారు.. వజ్రాల నిక్షేపాల కోసం అన్వేషణ సాగుతున్నట్లుగా పేర్కొన్నారు. బంగారు నిల్వల కోసం మహబూబ్ నగర్.. జోగులాంబ గద్వాల.. వనపర్తి.. నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

వజ్రాలకు మూలమైన కింబర్ లైట్.. లాంప్రోయిట్ రాళ్ల కోసం మహబూబ్ నగర్.. వికారాబాద్.. జోగులాంబ గద్వాల.. వనపర్తి.. నాగర్ కర్నూల్ లలో సర్వేను నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఇప్పటివరకు ఈ ఖరీదైన ఖనిజాల నిల్వలలకు సంబంధించిన అంచనాకు రాలేదన్నారు. ఈ అన్వేషణకు సంబంధించి తెలంగాణ గనుల శాఖ నుంచి కేంద్రానికి ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. మరీ..ఆసక్తికర అంశంపై తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏమైనా ప్రకటన చేస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News