ప్రేమపెళ్లి చేసుకున్నారు.. అంతలోనే విషాదం
ప్రేమకు ఆకర్షణకు మధ్య చిన్న తేడా ఉంటుంది. అది గుర్తించడానికి టీనేజ్ అనుభవం సరిపోదు. పెద్దవాళ్లు చెబితే మనసు ఒప్పుకోదు. ఈ క్రమంలో ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన ఈ విషాద సంఘటన గురించిన వివరాలు చూస్తే..
యూసుఫ్ గూడకు చెందిన 17ఏళ్ల యువకుడు ఇంటర్ చదువుతున్నాడు. సినిమా ఇండస్ట్రీలో పనిచేసే 20 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ.. ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు. దీంతో.. ఇద్దరూ కలిసి ఓ గది అద్దెకు తీసుకున్నారు. అందులోనే సహజీవనం చేస్తున్నారు. పెద్దలు ఎవరూ లేకుండా.. వాళ్లిద్దరే పెళ్లి కూడా చేసుకున్నారు.
సరిగ్గా వారం రోజులు గడిచాయి. ఆ తర్వాత ఏమైందో తెలియదు.. ఇద్దరూ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో అబ్బాయి చనిపోగా.. అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. చున్నీ తెగడంతో ఆమె కింద పడినట్టు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమకు వ్యామోహానికి తేడా తేలియని వయసులో ఒక్కటవుతున్న వారు.. సరైన నిర్ణయాలు తీసుకోలేక అర్ధంతరంగా జీవితాలను చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట చోటు చేసుకుండడం విషాదం.