అధికార టీఆర్ఎస్ కు మాత్రమే కాదు బీజేపీకి వార్నింగ్ ఇచ్చిన మావోలు

Update: 2020-09-21 04:45 GMT
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ మీద మావోలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాగజ్ నగర్ మండలం కందంబ అడవుల్లో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ బూటకమని.. తమ దళ సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని కాల్చి చంపినట్లుగా ఆరోపించారు. ఈ ఉదంతం నేపథ్యంలో తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ నేతలతో పాటుగా విపక్ష బీజేపీ నేతలకు వారు ఉమ్మడిగా వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.

బూటకపు ఎన్ కౌంటర్ ను తాము ఖండిస్తున్నామని.. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన మావో ప్రతినిధులను పోలీసులు చుట్టుముట్టి కాల్చి చంపారన్న ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మీద జరుగుతున్న పాశవిక అణిచివేతకు తాజా ఎన్ కౌంటర్ ఒక నిదర్శనమన్నారు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో అమరులైన చుక్కాలు.. బాజీరావులతో విప్లవోద్యమం ఆగదన్నారు భాస్కర్.

బూటకపు ఎన్ కౌంటర్లకు బాద్యులైన టీఆర్ఎస్.. బీజేపీ నేతలకు ప్రజల చేతిలో శిక్షలు తప్పవని వార్నింగ్ ఇవ్వటం కలకలంగా మారింది. తమ పార్టీలో కొత్తగా చేరిన బాజీరావు చూపించిన పోరాట పటిమను భాస్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజల కోసం పని చేసేందుకు వచ్చి ప్రాణత్యాగం చేసి వారి పోరాటం వేస్టే చేయమన్నారు. కార్బన్ సెర్చ్ పేరుతో గ్రామాల్ని చుట్టుముట్టి.. ఇండ్లను సోదాలు చేస్తున్నారని.. అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నట్లు చెప్పారు.

చిత్రహింసలకు గురి చేయటం.. బూతులు తిట్టటం లాంటివి చేస్తున్నారని.. కొందరిని కోర్టుల్లో హాజరు పర్చకుండా పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న పాశవిక అణిచివేతకు తాజా ఎన్ కౌంటర్ ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. చట్టబద్ధంగా అరెస్టు చేయాల్సింది పోయి పోలీసులు అన్యాయంగా కాల్చి చంపారన్నారు. తాజా వార్నింగ్ అధికార టీఆర్ఎస్.. విపక్ష బీజేపీ నేతలకు కొత్త టెన్షన్ పుట్టిస్తోంది.
Tags:    

Similar News