అసెంబ్లీ సీట్లు పెరగడం ఖాయం...పెద్దాయన చెబుతున్నారు !
రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు 2029 నాటికి పెరుగుతాయా అన్నది ఒక చర్చగా ఎప్పటి నుంచో ఉంచి.;
రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లు 2029 నాటికి పెరుగుతాయా అన్నది ఒక చర్చగా ఎప్పటి నుంచో ఉంచి. నిజానికి 2014 లో విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలోనే అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి ఉంది. ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు 294 అసెంబ్లీ సీట్లతో సౌత్ ఇండియాలోనే అత్యధిక సీట్లున్న స్టేట్ గా ఉండేది. కానీ విభజన జరిగాక మాత్రం ఏపీలో 175 సీట్లు ఉంటే తెలంగాణాకు 119 సీట్లు ఉన్నాయి. దాంతో వంద కంటే తక్కువ సీట్లు మ్యాజిక్ ఫిగర్ తో ఏపీ ఉంది. 60 నంబర్ మ్యాజిక్ ఫిగర్ గా తెలంగాణా ఉంది. దీంతో రాజకీయ సుస్థిరతకు ఇబ్బంది వస్తుందని భావించి సీట్లని పెంచాలని చట్టంలో పేర్కొన్నారు కానీ వరసగా మరో రెండు ఎన్నికలు జరిగిపోయాయి కానీ అలా అయితే అసలు జరగలేదు. కానీ 2029లో కచ్చితంగా అసెంబ్లీ సీట్లు పెరగడం ఖాయమని రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు గట్టి నమ్మకంతో ఉన్నాయి.
జనగణన తర్వాత :
దేశవ్యాప్తంగా రెండు విడతలుగా జన గణన అన్నది ఈ ఏడాది మొదట్లో మొదలవుతోంది. అది 2027 మొదటి దాకా కొనసాగుతుందని చెబుతున్నారు. దాంతో లెక్కలు అన్నీ పక్కాగా వస్తాయని ఆ మీదట దేశంలో పార్లమెంట్ సీట్ల పునర్ విభజన జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లు కాస్తా 750 దాకా పెరుగుతాయని అంటున్నారు. పనిలో పనిగా రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచుతారు అని అంటున్నారు దాంతో ఏపీలో 225 నుంచి 235 దాకా అసెంబ్లీ సీట్లు పెరగవచ్చు అని అంటున్నారు. అలాగే తెలంగాణ లో 155 నుంచి 160 దాకా సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు.
కేసీఆర్ ధీమా :
ఇక ఈ విషయంలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ధీమాగా ఉన్నారని అంటున్నారు. ఆయన తన దగ్గరకు వస్తున్న బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి ఈసారి పోటీకి రెడీగా ఉండమని చెబుతున్నారని ప్రచారం సాగుతోంది. గతంలో వివిధ కారణాల వల్ల సీటు ఇవ్వలేకపోయిన వారికి అలాగే బలమైన నేతలకు ఆయన పిలిచి మరీ అంతా సిద్ధం చేసుకోండి ఇప్పటి నుంచే జనాల్లో ఉండండి అని చెబుతున్నారని టాక్ నడుస్తోంది. అందరికీ అవకాశాలు వస్తాయి ఎందుకంటే మరో నలభై దాకా సీట్లు పెరుగుతాయని చెబుతున్నారని అంటున్నారు.
మ్యాటర్ తెలిసిందా :
కేసీఆర్ అంటే రాజకీయ వ్యూహకర్తగా అంతా చెబుతారు. అలాగే ఆయనకు జాతీయ స్థాయిలో కూడా ఎక్కువగా పరిచయాలు ఉన్నాయి. కేంద్ర మంత్రిగా పనిచేశారు. దాదాపుగా పదేళ్ల పాటు ఎంపీగా కూడా ఉన్నారు. దాంతో ఆయనకు వివిధ రాజకీయ పార్టీల నేతలతో మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. దాంతో పెద్దాయనకు సీట్ల పెంపుదల మీద కచ్చితమైన సమాచారమే వచ్చి ఉంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
హుషారుగా నేతలు :
సీట్లు ఎక్కువ పెరుగుతాయని బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీకి దిగుతుందని కాబట్టి జనంలో పలుకుబడి ఉంటే చాలు తమకు తప్పకుండా చాన్స్ దక్కుతుంది అని గులాబీ నేతలు బలంగా నమ్ముతున్నారు. దాంతో వారిలో ఒక్కసారిగా హుషార్ పెరుగుతోంది అని అంటున్నారు. ఇక ఏపీలో చూసుకున్నా మరో 60 సీట్ల దాకా పెరుగుతాయని అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగితే కూటమికి మేలు అని మిత్రుల కోరిక మేరకు వారికి కొన్ని సీట్లు పెంచి ఇచ్చినా మిగిలిన వాటిలో టీడీపీలో ఆశావహులకు న్యాయం చేయవచ్చు అని ఆ పార్టీ ఆలోచిస్తోంది అని అంటున్నారు.