ఈయూ దేశాలకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్
యూరోపియన్ యూనియన్ దేశాలకు రష్యా అధినేత పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.;
యూరోపియన్ యూనియన్ దేశాలకు రష్యా అధినేత పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికీ తమ మీద ఈయూ ఆంక్షలను కఠినతరం చేస్తే ఇంధన సరఫరాలను నిలిపివేస్తామని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఒక వైపు ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేస్తున్న వేళ మరో వైపు రష్యా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో తమ మీద ఆంక్షలకు తెగించే యూరోపియన్ యూనియన్ దేశాలకు ఇంధనం సరఫరా లేకుండా చేస్తామని పుతిన్ ప్రకటించారు.
తలుపులు మూసే వరకూ :
ఇక ఈయూ దేశాలు తలుపులు మూసే వరకు వేచి ఉండకుండా రష్యాయే కీలక నిర్ణయం తీసుకుంటుంది అని ఆయన అంటున్నారు. తమ మీద ఈయూ ఏ రకమైన ఆంక్షలు అయినా విధించినట్లయితే యూరోపియన్ మార్కెట్‌కు ఇంధన ఎగుమతులను నిలిపివేయడాన్ని మాస్కో చాలా సీరియస్ గా పరిగణించవచ్చని పుతిన్ తేల్చి చెప్పేశారు. యూరోపియన్ యూనియన్ రష్యా లోని సహజ వాయువు ఇంధన సరఫరాలపై అదనపు ఆంక్షలను సిద్ధం చేస్తోందనే నివేదికల నేపథ్యంలో పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే జరిగితే రష్యా ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని తాము కూడా ఈయూ దేశాల పైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని పుతిన్ హెచ్చరించారు.
ఈయూ ఆలోచనలు అవి :
ఇక రష్యా సహజ వాయువు, ఇంధనంపై అదనపు ఆంక్షలు విధించాలని ఈయూ దేశాలు ఆలోచిస్తున్నాయని పుతిన్ అన్నారు. వారు రష్యా ముఖం ముందు తలుపు మూసే వరకు వేచి ఉండకుండా యూరోపియన్ మార్కెట్‌కు ఇంధన సరఫరాలను నిలిపివేసే అవకాశాన్ని సీరియస్ గా పరిశీలించాలని తాను రష్యా ప్రభుత్వానికి సూచించానని పుతిన్ చెప్పారు ఇదిలా ఉంటే హార్ముజ్ జలసంధి కీలకమైన ఇంధన షిప్పింగ్ మార్గంగా చెప్పారు. దీని ద్వారా ప్రపంచానికి ముడి చమురు రవాణాలో దాదాపు 20 శాతం పైగా వెళ్తోందని ఇది ప్రపంచ ఇంధన మార్కెట్లపై పెద్ద ప్రభావాన్ని చూపే ప్రాంతం అని పుతిన్ ఈ సందర్భంగా అన్నారు.
తీవ్ర పరిణామాలు :
ఈ క్రమంలో మధ్యప్రాచ్యంలో అస్థిర పరిచే ప్రయత్నాలు ప్రపంచ ఇంధన మార్కెట్లకు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయని కూడా పుతిన్ ఈయూ దేశాలను హెచ్చరించారు.ఈ మేరకు రష్యా చాలాసార్లు హెచ్చరించిందని ఆయన గుర్తు చేశారు. ఇంధన మార్కెట్లలో పెరుగుతున్న అస్థిరత ప్రాంతీయ పరిణామాలకే మాత్రమే పరిమితం కాలేదని విస్తృత ఆర్థిక పరిణామాలకు అది దారి తీసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇది అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల మొత్తం వ్యవస్థను ప్రభావితం చేస్తుందని పుతిన్ విశ్లేషించారు.
వారి వైపే రష్యా :
ఇక ఈయూ దేశాలను హెచ్చరించిన పుతిన్ అదే సమయంలో రష్యాకు విశ్వసనీయ భాగస్వాములు అయిన దేశాలకు మాస్కో ఇంధన వనరులను సరఫరా చేస్తూనే ఉంటుందని చెప్పడం విశేషం. అలాంటి దేశాలకు రష్యా నిరంతరం ఇంధన వనరులను సరఫరా చేస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. అదే సమయంలో రష్యన్ కంపెనీలు ప్రస్తుత పరిస్థితి సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. దీర్ఘకాలిక నిబద్ధత యొక్క స్పష్టమైన సంకేతాలు ఉంటే యూరోపియన్ దేశాలతో ఇంధన సంబంధాలను పునరుద్ధరించడానికి రష్యా సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇక రష్యా యూరోపియన్ దేశాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని, కానీ వారు మాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని మాకు నమ్మకం కలగాలని పుతిన్ చెప్పారు