నాటౌట్ అంటూ సెంటిమెంట్ తో కొట్టిన మోడీ
నరేంద్ర మోడీ మాటల చమత్కారం గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడ ఎపుడు ఎలా మాట్లాడాలో బాగా తెలిసిన వారుగా గుర్తింపు పొందారు.
నరేంద్ర మోడీ మాటల చమత్కారం గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడ ఎపుడు ఎలా మాట్లాడాలో బాగా తెలిసిన వారుగా గుర్తింపు పొందారు. పార్లమెంట్ లో చర్చల సందర్భంగా అయినా బహిరంగ సభలలో అయినా మోడీ స్పీచ్ వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఆయన విపక్షాలు చేసే విమర్శలనే పట్టుకుని తిరిగి వాటినే వారి మీద బలంగా ప్రయోగిస్తూంటారు. లేటెస్ట్ గా మోడీ చేసిన ఈ తరహా కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రతిపక్షాలను గట్టిగానే మోడీ టార్గెట్ చేశారు.
ఆఖరి శ్వాస వరకూ :
ఇక మోడీ గుజరాత్లోని బనాస్కాంత జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ తాను చివరి ఊపిరి వరకూ దేశం కోసం పనిచేస్తాను, ప్రజా సేవలో ఉంటాను అని స్పష్టం చేశారు. తాను ఎపుడూ జనం కోసం పనిచేస్తాను అని చెప్పారు. అలా సేవ చేయడంలోనే తాను నిమగ్నం అవుతాను అన్నారు. అదే తనకు సంతోషాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. ప్రజా సేవకే తాను పునరంకితం అవుతాను అని ఆయన అన్నారు.
సర్పంచ్ కూడా కాలేదు :
ఇక మోడీ తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ ఎవరికీ ఎక్కడా రాజకీయ వాసనలే లేవని అన్నారు. తన కుటుంబం నుంచి ఎవరూ కనీసం పంచాయతీ సర్పంచ్ గా పనిచేయలేదని గుర్తు చేశారు. తాను అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చాను అని ఆయన గతాన్ని తలచుకున్నారు. అలాంటి నాకు మొదట ప్రజా సేవకు అవకాశం ఇచ్చింది గుజరాత్ ప్రజలే అని ఆయన అంటూ మీ రుణం తీర్చుకోలేను అన్నారు. ఆ మీదట దేశానికి సేవ చేసే భాగ్యం దక్కింది అని అంటూ ఇది గొప్ప బాధ్యత పెద్ద అవకాశంగా ఆయన అభివర్ణించారు. అందువల్ల తాను దేశ ప్రజల రుణం కూడా ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పారు. తాను జీవితాంతం ప్రజలకు రుణపడి ఉంటాను అన్నారు. ఇక తాను సాధించిన ప్రతీ విజయం వెనక అలాగే తన అభివృద్ధి వెనక దేశమంతా ఉందని మోడీ చెప్పారు.
విరమణ అన్నది లేదు :
తన సొంత గడ్డ మీద నిలబడి మోడీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా విశ్లేషించుకుంటే తన చివరి శ్వాస వరకూ దేశం కోసం పనిచేస్తాను అన్నారు. ప్రజా సేవలో ఉంటాను అన్నారు. దాంతో మోడీ నాటౌట్ అని అంటున్నారు. ఆయన తప్పుకుంటారు అని లేదా దూరంగా ఉంటారు అని ఎవరైనా అనుకుంటే అది తప్పు అన్నట్లుగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు 2029 ఎన్నికల్లో సైతం బీజేపీ తరఫున ఎన్డీయే పక్షాన ప్రధాని అభ్యర్ధిగా మోడీ ఉంటారు అన్నది కూడా స్పష్టం అయింది అని అంటున్నారు. నిజం చెప్పాలంటే బీజేపీలో కానీ ఎన్డీయేలో కానీ మోడీకి సరి సాటి ఆప్షన్ వేరొకరు లేరనే అంటున్నారు.
సామాన్యుడిని అంటూ :
తాను అత్యంత సామాన్య కుటుంబంలో నుంచి వచ్చి దేశం కోసం పనిచేస్తున్నాను అని మోడీ చెప్పారు. అదే సమయంలో విపక్షాల వైఖరిని కూడా మోడీ తప్పు పట్టారు. దేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొందరు సంతోషిస్తున్నారు అని అంటూ ఆయన పరోక్షంగా గట్టి విమర్శలే చేశారు. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న పరిణామాలు మీద విపక్షాలు తప్పుగా మాట్లాడాయని తన ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. దేశంలో ఎరువుల ధరలు పెరుగుతాయని వంట గ్యాస్ సరఫరా ఆగిపోతుందని దుష్ప్రచారం చేశారు అని ఆయన విమర్శించారు. ఎన్ని సంక్షోభాలు ఉన్నా ప్రజల కోసం కేంద్రం సరైన చర్యలు తీసుకుందని మోడీ గుర్తు చేశారు.