దేశంలో నిరుద్యోగం రేటు ఎలా ఉందంటే ?
భారత దేశం అతి పెద్ద జనాభా కలిగిన దేశం. ఇక్కడ చదువుకు ఉపాధికి మధ్య సంబంధం ఉండకపోవడంతో ఉపాధికి ఎక్కువ అవకాశాలు లభ్యత ఉండదు, అలాగే గ్రామీణ భారతం ఎక్కువ, వ్యవసాయ దేశంగా ఉంది;
భారత దేశం అతి పెద్ద జనాభా కలిగిన దేశం. ఇక్కడ చదువుకు ఉపాధికి మధ్య సంబంధం ఉండకపోవడంతో ఉపాధికి ఎక్కువ అవకాశాలు లభ్యత ఉండదు, అలాగే గ్రామీణ భారతం ఎక్కువ, వ్యవసాయ దేశంగా ఉంది, దాంతో ఆ రంగంలో కూడా ఉపాధి ఎంత ఉన్నా సీజన్ల వారీ నిరుద్యోగం అక్కడా కనిపిస్తుంది. అలాగే చాలీ చాలని జీతాలు కొలువులతో ప్రచ్చన్న నిరుద్యోగం పెద్ద ఎత్తున ఉంది. దీంతో దేశంలో నిరుద్యోగం రేటు అంటే డేటా ఎలా చెప్పాలన్నది ఒక చర్చ. అలాగే నిర్వచనం ఎలా చేయాలన్నది మరో చర్చ. అయితే ప్రభుత్వాలు మాత్రం డేటాను ఎప్పటికపుడు రిలీజ్ చేస్తూ ఉంటాయి. తాజాగా ఒక డేటా అయితే వెలువడింది. దాని ప్రకారం చూస్తే ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
స్థిరంగానే నిరుద్యోగం రేటు :
ఇక దేశంలో చూస్తే నిరుద్యోగం రేటు స్థిరంగా ఉంది అని తాజా డేటా చెబుతోంది. దేశంలో 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల నిరుద్యోగ రేటు డిసెంబర్‌లో చాలా వరకు స్థిరంగా ఉంది అని ఈ నివేదిక వెల్లడించింది. ఇది నవంబర్ 2025 లో నమోదైన 4.7 శాతం తో పోలిస్తే 4.8 శాతంగా అంచనా వేయబడిందని చెబుతోంది. ఈ డేటాను కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది.
గ్రామీణ నిరుద్యోగ రేటు :
ఈ మంత్రిత్వ శాఖ విడుదల చేసే నెలవారీ శ్రామిక శక్తి నిరుద్యోగ డేటా ప్రకారం చూస్తే గ్రామీణ నిరుద్యోగ రేటు 3.9 శాతం వద్ద స్థిరంగా ఉంది. 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గ్రామీణ పురుషులలో నిరుద్యోగ రేటు గత సంవత్సరం డిసెంబర్‌లో 4.1 శాతం వద్ద తక్కువగా స్థిరంగా ఉంది. అలాగే పట్టణ మహిళా నిరుద్యోగ రేటు గత నెలలో 9.1 శాతానికి తగ్గింది, ఇది నవంబర్ 2025 లో 9.3 శాతంగా ఉంది. ఇక 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో మొత్తం శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు కూడా గత నెలలో 56.1 శాతంగా ఉంది. ఇక ఇది నవంబర్ 2025 లో 55.8 శాతంగా ఉందని నివేదిక చెబుతోంది.
అంచనా ఇలా :
ఇక గ్రామీణ ప్రాంతాలలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు డిసెంబర్ 2025 లో 59 శాతంగా అంచనా వేయబడిందని నివేదిక తెలియచేసింది. ఇది పోల్చి చూస్తే కనుక గత సంవత్సరం నవంబర్‌లో 58.6 శాతంగా ఉందని పేర్కొంది. అలాగే 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల మొత్తం కార్మికుల జనాభా నిష్పత్తి గత నెలలో స్వల్పంగా పెరిగి వార్షిక గరిష్ట స్థాయి 53.4 శాతానికి చేరుకుంది. ఇలా కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదికలో వివరాలు ఉన్నాయి. అయితే ప్రచ్చన్న నిరుద్యోగం కూడా నిరుద్యోగమే అని చెప్పాలి. చాలీ చాలని బతుకుల గురించి కూడా వివరాలు సేకరించాల్సి ఉంది. ఈ రోజుకీ రోజుకు పాతిక ముప్పై రూపాయల వేతనంతో బతికే వారు ఉన్నారని మరో వైపు ప్రచారంలో ఉన్న మాట. ఏది ఏమైనా దేశంలో నిరుద్యోగ రేటు తగ్గితే అది మంచి పరిణామమే అని అంటున్నారు.