ఉత్తమ్ సీటుపై ఇద్దరి కన్ను.. కన్ఫర్మ్ చేసేసిన ఠాగూర్
గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సందడి వాతావరణం నెలకొంది. గతానికి భిన్నంగా రాష్ట్రానికి కేటాయించిన పార్టీ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పార్టీకి చెందిన నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. పలువురు నేతలతో భేటీ కావటంతో పాటు.. తెలంగాణ కాంగ్రెస్ లోపాల్ని విశ్లేషించే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. వ్యక్తిగత విభేదాల్ని పక్కన పెట్టి.. టీం తెలంగాణ స్పిరిట్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో పార్టీకి పునర్ వైభవం తీసుకురావటమే లక్ష్యమన్నట్లుగా ఆయన తీరు ఉంటోంది.
పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాల్ని చక్కదిద్దేందుకు పక్కా ప్లాన్ ఉందంటున్న ఆయన మాటలు.. ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాలి. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్న ఆయన.. అభిప్రాయాలు ఏమైనా సరే పార్టీ వేదికలోనే వినిపించాలే కానీ.. మీడియాకు.. సోషల్ మీడియాకు ఎక్కితే మాత్రం సహించేది లేదని తేల్చారు.
పీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్న ఉత్తమ్ ను మారుస్తారా? అన్న ప్రశ్నకు ఆయన ఓపెన్ గానే బదులిచ్చారు. ఉత్తమ్ సీటును తాము ఆశిస్తున్నట్లుగా ఇద్దరు చెప్పేశారని.. అయినా ఆ విషయం మీద నిర్ణయం తీసుకునేది సోనియా.. రాహుల్ గాంధీనే అని స్పష్టం చేసిన ఆయన.. తాను మాత్రం టీం ఆఫ్ తెలంగాణ గురించి మాత్రమే మాట్లాడుతున్నట్లు స్పష్టం చేశారు.
జట్టులో ధోనీ.. కోహ్లీ.. శిఖర్ థవన్ ఇలా ఎవరి ఆట వారు ఆడొచ్చు. టీం స్పిరిట్ చాలా ముఖ్యం. కెప్టెన్ మాత్రం లక్ష్యసాధన కోసం పని చేస్తాడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గమే పవర్ ఫుల్ అన్న ఆయన.. కేసీఆర్ ఫ్యామిలీ.. జగన్ రాజ్ ల మాత్రం ఉండదన్నారు. పార్టీకి పునర్ వైభవం ఎలా తెస్తారంటే తన దగ్గరి వ్యూహానని బయటపెట్టేశారు మాణిక్యం.
మండలస్థాయిలో కార్యక్రమాలు చేపడతామని.. ప్రతి ఇంటి తలుపునూ కాంగ్రెస్ కార్యకర్తలు తట్టనున్నట్లు చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో జరిగే నష్టాన్ని వివరించేందుకు రాష్ట్రంలోని 30 లక్షల మంది రైతుల్ని పార్టీ నేతలు కలవనున్నారన్నారు. రైతాంగాన్ని మోడీసర్కారు.. అంబానీ.. ఆదానీలకు అప్పగిస్తున్న వైనాన్ని వివరిస్తామని చెప్పారు. మొత్తంగా తెలంగాణలో పార్టీని పటిష్టం చేసే విషయంపై తనకు క్లారిటీ ఉందన్న విషయాన్ని తన మాటలతో ఠాగూర్ స్పష్టం చేస్తున్నారని చెప్పాలి.