ఎయిర్ పోర్ట్ లో బాంబ్ ... ముందుకొచ్చిన నిందుతుడు !

Update: 2020-01-22 10:02 GMT
కర్ణాటక లోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు లభించిన విషయం తెలిసిందే. ఆ సంఘటనలో అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తి బుధవారం పోలీసుల ఎదుట లొంగి పోయాడు. ఎయిర్ పోర్టు లో బాంబు  పెట్టింది నేనే అని పోలీసులకు చెప్పడం తో వారు షాక్ కు గురైనారు. ఎయిర్ పోర్టు లో తనకు ఉద్యోగం ఇవ్వలేదని కసి, పగతో యూట్యూబ్ లో బాంబులు ఎలా తయారు చెయ్యాలి ? అని నేర్చుకుని బాంబు తయారు చేసి పెట్టానని ఆదిత్యరావ్ చెప్పడంతో పోలీసుల దిమ్మతిరిగిపోయింది.

ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. మంగళూరు ఎయిరుపోర్టు ఘటనకు బాధ్యత వహిస్తూ మణిపాల్‌ కు చెందిన ఆదిత్య రావు అనే వ్యక్తి తమకు లొంగిపోయాడని తెలిపారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం అతడిని మంగళూరు టీంకు అప్పగించనున్నట్లు వెల్లడించారు.

కాగా, సోమవారం ఉదయం 10 గంటల సమయంలో టికెట్‌ కౌంటర్‌ వద్ద విమానాశ్రయ పోలీసులు అనుమానాస్పద బ్యాగ్‌ను కొనుగొన్న విషయం తెలిసిందే.

ఆ తరువాత అక్కడికి చేరుకున్న నగర పోలీసు బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ ఆ బ్యాగులో  పేలుడు పదార్థం  ఉన్నట్టుగా అనుమానించారు. బ్యాగ్‌ లోని మెటల్‌ కాయిన్‌ బాక్స్‌లో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు నింపినట్లుగా గుర్తించారు. దీంతో ఆ బ్యాగ్‌ ను బాంబు తరలింపు వాహనం ద్వారా కిలోమీటరు దూరంలో ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్లారు. కట్టుదిట్టమెన భద్రత నడుమ సాయంత్రం 5.30 గంటలకు ఆ బాంబ్ ని పేల్చారు. ఇక ఈ ఘటన పై విచారణ చేపట్టిన అధికారులు సీసీ కెమెరా ఆధారం గా నిందితుడి ఫొటోలు విడుదల చేశారు. ఈ సమయంలోనే బుధవారం అతడే వచ్చి పోలీసులకు లొంగిపోయాడు.
Tags:    

Similar News