• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పరేషాన్ లో మహారాజకీయం.....

పరేషాన్ లో మహారాజకీయం.. కాంగ్రెస్ పై చేయి సాధిస్తుందా !

By - Tupaki Desk
Update: 2019-10-30 04:58 GMT
తాజాగా జరిగిన ఎన్నికలలో మహారాష్ లో శివసేన - బీజేపీ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే.  288 స్థానాలకు జరిగిన ఈ  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి 161 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 105 సీట్లు, శివసేన 56 సీట్లు గెలిచింది. దీనితో అందరూ మిత్రపక్షాలైన బీజేపీ , శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనమే అని అనుకున్నారు. కానీ , ముఖ్యమంత్రి పీఠం విషయంలో బీజేపీ , శివసేన మధ్య కీచులాట మొదలై ..మద్దతు ఉపసంహరించుకునే స్థాయికి చేరింది.

ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటినుండి శివసేన 50 -50 పార్ములా కింద ముఖ్యమంత్రి పదవి చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందే అని పట్టుబడుతోంది. బీజేపీ మాత్రం దానికి ససేమిరా అనడం తో ఇద్దరి మధ్య కుమ్ములాటలు మొదలైయ్యాయి. ఈ తరుణంలో   ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నేనే మరో ఐదేళ్లు సీఎంగా ఉండబోతున్న అని ప్రకటించడంతో శివసేన మరింత మండిపడుతుంది. నేను అమిత్‌ షాతో మాట్లాడాను. అధికారం చెరిసగం కాలం పంచుకోవడానికి తానెలాంటి హామీ ఇవ్వలేదని ఆయన స్పష్టంగా చెప్పారు అని సీఎం తెలియజేసారు.

ఆదిత్య ఠాక్రేను డిప్యూటీ సీఎం చేస్తారా అని ప్రశ్నించగా.. సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు, కానీ సరైన సమాధానం మాత్రం చెప్పలేదు. ఫడణవీస్‌ వ్యాఖ్యలతో స్పందించిన శివసేన జర యాద్‌ కరో జబానీ(హామీ గుర్తుకు తెచ్చుకోండి) శీర్షికన ఓ పాత వీడియో క్లిప్పింగ్‌ను ఆయనకు పంపింది. అది ఈ ఏడాది ఫిబ్రవరి 18 నాటిది. అధికారంలోకి వచ్చాక పదవులు, బాధ్యతలు చెరిసగం పంచుకుందామని ఫడణవీస్‌ అందులో వ్యా ఖ్యానించినట్లు ఉంది. ఈ విషయాన్ని ఆయన కెమెరా ఎదుట స్పష్టంగా అన్నారు. మరిప్పుడు అనలేదంటే.. నిజానికి వేరే నిర్వచనం ఇవ్వాలేమో అని సేన నేత సంజయ్‌ రౌత్‌ చెప్పారు.

చెరి సగం అన్నది అధికారం విషయంలోనే తప్ప సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవడం కాదు అని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ తమకి అనుగుణంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. శివసేన నిర్దిష్ట ప్రతిపాదనలతో ముందుకొస్తే పరిశీలించడానికి సిద్ధం. మా అధినాయకత్వంతోనూ, మిత్రపక్షమైన ఎన్సీపీతోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ఇప్పటికే   ప్రకటించారు. అలాగే శివసేన నేతలు కూడా బీజేపీ సరైన నిర్ణయం తీసుకోకపోతే ప్రత్యామ్న్యాయం చూసుకోకతప్పదు అని ఇప్పటికే ప్రకటించింది.
Tags:    
  • Shiv Sena 
  • Election Results 
  • Maharastra Haryana Results 
  • Counting 
  • Modi 
  • Rahul Gandhi 
  • Sonia Gandhi 
  • Central Government 
  • Latest Political News 
  • Tupaki News 
  • ElectionResults2019 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS