బీజేపీయే కరోనా దేశమంతా వ్యాపింప చేసింది

Update: 2020-04-09 17:00 GMT
భారత్ లో తగ్గిపోయిందనుకుంటున్న సమయంలో కరోనా వ్యాప్తికి ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలు వాహకంగా మారాయి. అక్కడ ప్రార్థనలు చేసిన వారంతా దేశమంతా పోయి కరోనాను విస్తరింపచేశారు. ఇప్పడు ఈ ఘటన దేశమంతా చర్చనీయాంశమైంది. దీనిపై విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకుంటున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున నిజాముద్దీన్ లో మర్కజ్ ప్రార్థనలు జరుగుతున్న ఢిల్లీ పోలీసులు - జాతీయ భద్రత సలహాదారు(ఎన్ ఐఏ) అజిత్ దోవల్ వ్యవహరించిన తీరుపై తాజాగా మహారాష్ట్ర  హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ నిప్పులు చెరిగారు.

మర్కజ్ ప్రార్థనలు చేసిన వారితో కేంద్ర హోంశాఖ , అజిత్ దోవల్ లు దేశంలోని వివిధ రాష్ట్రాలకు కరోనా వైరస్ వ్యాప్తి చేశారంటూ మహారాష్ట్ర హోంమంత్రి ఆరోపించారు. ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు.ఈ ప్రార్థనలకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారని.. బీజేపీ ప్రోద్బలంతోనే సభ జరిగిందని.. దేశమంతా కరోనా వ్యాప్తికి బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నా ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు.

ఇక మరో విషయం కూడా ఆయన చెప్పుకొచ్చాడు. మార్చి 14 - 15 తేదీల్లో  మహారాష్ట్రలో జరగాల్సిన మర్కజ్ అభినందన సభకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా తిరస్కరించిందని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తాము అనుమతి ఇవ్వలేదని మహారాష్ట్ర హోంమంత్రి తెలిపారు.

ఇక అజిత్ ధోవల్ కూడా వెళ్లి మర్కజ్ చీఫ్ మౌలానను ఎందుకు కలిశారని.. వారి మధ్య జరిగిన చర్చ ప్రజలకు తెలియజేయాలని హోంమంత్రి డిమాండ్ చేశారు. దోవల్ ను కలిశాక మౌలాన ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాడని ప్రశ్నించాడు.  దీనివెనుక ఏం జరిగిందో ప్రజలకు తెలుపాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags:    

Similar News