మాజీ అనుచరుల బ్లాక్ మొయిలింగ్ తోనే ఆ స్వామీజీ ఆత్మహత్య

Update: 2021-11-25 12:30 GMT
దగ్గర దగ్గర నెల రోజుల క్రితం ప్రముఖ స్వాములోరు సూసైడ్ చేసుకున్న వైనం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతటి పెద్ద మనిషి.. సన్యాసి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందన్న సందేహాల నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు.. స్వాములోరి ఆత్మహత్య వెనుకున్న రహస్యాన్ని చేధించే పనిలో ఉన్నారు.

అఖిల భారతీయ అఖాడా పరిషత్ కు అధ్యక్షుడంటే మాటలు కాదు. అలాంటి మహంత్ పిరికివాడిలా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారన్నది పెద్ద ఫజిల్ గా మారింది. దీని రహస్యాన్ని చేదించేందుకు సీబీఐ నేరుగా రంగంలోకి దిగింది.

కొద్ది రోజులుగా జరుపుతున్న విచారణలో కొత్త విషయాలుబయటకు వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. గతంలో మహంత్ నరేంద్ర గిరి వద్ద శిష్యులుగా పని చేసిన ఆనంద్ గిరి.. ఆధ్యప్రసాద్ తివారీ.. అతని కొడుకు సందీప్ తివారీల చేతిలో ఎదురవుతున్న అవమానాలు భరించలేకనే మహంతు సూసైడ్ చేసుకున్నట్లుగా భావిస్తున్నారు.

తాజాగా బయటకు వచ్చిన సీబీఐ ఛార్జిషీట్ లో.. మహంతుకు సంబంధించిన ఒక వీడియో తన చేతిలో ఉందని.. తాను చెప్పినట్లుగా వినకుండా ఈ వీడియోను బయటకు విడుదల చేస్తానని తరచూ బెదిరించేవాడని.. దీంతో విసిగిపోయిన మహంత్ నరేంద్ర గిరి ఆరోపించినట్లుగా చెబుతున్నారు.

తనను తన మాజీ శిష్యూలు ఏ రీతిలో బెదిరింపులకు పాల్పడ్డారన్న విషయాన్ని కూడా ఆయన రికార్డు చేసినట్లుగా చెబుతున్నారు. అలహాబాద్ లోని బాఘంబరీ మఠంలో తన దిలో సెప్టెంబరు 20న మహంత్ గిరి తన గదిలో ఉరి వేసుకొని మరణించారు. ఈ విషయం స్థానికంగానే కాదు.. ఆ రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది.ఇప్పుడీ కేసుకు సంబంధించిన కీలక సమాచారం సీబీఐ సేకరించినట్లుగా చెబుతున్నారు.




Tags:    

Similar News