బర్త్​ డే పార్టీలో బరితెగుంపు.. శ్రుతిమించిన రొమాన్స్​.. చంపేసిన లవర్ బ్రదర్​

Update: 2020-09-18 23:30 GMT
బర్త్​డే పార్టీ లో ప్రియురాలి తో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి... తన ప్రేయసి సోదరుడి దాడిలో చనిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని వజీరాబాద్ చెందిన సాహిల్​.. తన పక్కింట్లోనే ఉంటున్న వర్ష అనే యువతి ని ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమ వ్యవహారం తల్లి దండ్రులకు తెలియదు. అయితే వర్ష సోదరుడికి ఆకాశ్​కు మాత్రం తెలుసు. గురువారం సాహిల్ గ్రాండ్​గా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాడు.

 తన స్నేహితులతో పాటు వర్షను కూడా పార్టీకి ఆహ్వానించాడు. అయితే సాహిల్​ వైఖరి పై అనుమానం రావడంతో వర్ష అతడి సోదరుడు ఆకాశ్​తో కలిసి పార్టీకి వెళ్లింది. పార్టీ నుంచి  అందరూ వెళ్లిపోయారు. బర్త్​డే బాయ్​, అతడి లవర్​, ఆమె సోదరుడు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు. తనతో కలిసి మద్యం సేవించాలని సాహిల్​ వర్షను పట్టుబట్టాడు. ముందు అందుకు వర్ష నిరాకరించింది. కానీ అతడు  పదే పదే బతిమాలడంతో ఆమె ఒప్పుకుంది.

 దీంతో అతిగా మద్యం సేవించిన సాహిల్​.. మత్తులో వర్షతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఎంత వారించినా వినకుండా రెచ్చి పోయాడు. ఆమెను ఆమె తమ్ముడి ముందే అసభ్యంగా తాకడం మొదలు పెట్టాడు. దీంతో ఆగ్రహం చెందిన వర్ష  సాహిల్ తలపై బీర్ బాటిళ్ల తో కొట్టింది. అయినా అతడు వదలక పోవడంతో తన సోదరుడికి సైగ  చేసింది. అప్పటికే సాహిల్  చేష్టలతో మండిపోతున్న  అతడు సాహిల్​ తలపై   బీర్​ బాటిల్ ​తో గట్టిగా కొట్టాడు.  దీంతో సాహిల్​ అక్కడికక్కడే కుప్పకూలాడు.  పోలీసులకు సమాచారం అంది అక్కడికి వచ్చేలోగా నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
Tags:    

Similar News