రిమోట్ బాంబుతో శివాలయాన్ని పేల్చేశారు
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయంపై దాడి చేశారు. భారత్-మయన్మార్ బోర్డర్ సమీపంలో ఆ ఆలయం ఉంది. దీంతో స్థానికులు భాయందోళనలకు గురయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆ శివాలయాన్ని రెండవ అతి పెద్దగా ఆలయంగా గుర్తిస్తారు. మోహెరే పట్టణంలో సెటిలైన తమిళులు ఆ ఆలయాన్ని 18 ఏళ్ల క్రితం నిర్మించారు. ఆ పట్టణంలో హిందువులు - ముస్లింలు - క్రైస్తవులు ఉన్నారు. అయితే శక్తివంతమైన రిమోట్ కంట్రోల్ బాంబుతో ఆలయాన్ని పేల్చివేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ రోజు ఉదయం 8.45 నిమిషాలకు ఈ దాడి జరిగింది. పేలుడు ధాటికి ఎలక్ట్రిక్ బల్బులు - వాటర్ ట్యాంకర్లు - కిటికీలు ధ్వంసం అయ్యాయి. కాగా, ఈ దాడి వెనుక స్థానిక మిలిటెంట్లు ఉన్నారని భావించే పరిణామాలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఎటువంటి డిమాండ్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆలయ అధికారులు తెలిపారు. అస్సాం రైఫిల్స్‌కు చెందిన దళాలు వెంటనే గుడి వద్దకు చేరుకున్నారు. గత ఆదివారం కూడా మయన్మార్ వైపున ఉన్న నేపాలీ ఆలయంలో కూడా బాంబు పేలుడు జరిగింది. అయితే ఆలయాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదని ఆలయపూజారాలు అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/