తెలుగుదేశం గెలవడం కంటే లోకేష్ గెలవడం ఇంపార్టెంటా?

Update: 2021-12-30 16:30 GMT
వ‌చ్చే ఎన్నిక‌లు.. టీడీపీకి చాలా చాలా ముఖ్యం. ఈ విష‌యం ఆ పార్టీ నేత‌ల‌కు తెలిసిందే. అంతేకాదు.. పార్టీ అభిమానుల‌కూ తెలిసిన విష‌య‌మే.  టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అసెంబ్లీలో భీష‌ణ ప్ర‌తిజ్ఞే చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు. సో.. ఆయ‌న శ‌ప‌థాన్ని నెర‌వేర్చ‌డం.. కోస‌మైనా.. పార్టీ శ్రేణులు ప‌నిచేయాలి. అయి తే.. వీట‌న్నింటికీ మించి.. టీడీపీ యువ నాయ‌కుడు.. మాజీ మంత్రి నారా లోకేష్‌.. వ్య‌వ‌హారం కూడా చ‌ర్చ‌కు దారితీసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో లోకేష్ గెలిచి తీరాల‌నేది పార్టీ నాయ‌కులు పెట్టుకున్న ల‌క్ష్యంలో ఒక‌టి. ఎందుకంటే.. పార్టీ వ‌చ్చే ఐదేళ్ల‌లో అధ్య‌క్షుడి మార్పు ఉంటుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పార్టీ అధ్య‌క్షుడిగా.. చంద్ర‌బాబు ఉండ‌క‌పోవ‌చ్చు. లేదా.. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక ల్లో సీఎం అయినా.. పార్టీ అధ్య‌క్షుడిగా మాత్రం త‌ప్పుకొనే అవ‌కాశం ఉంది. అంటే.. వీటిలో ఏం జ‌రిగినా.. అధ్య‌క్ష ప‌గ్గాల‌ను.. లోకేష్‌కు అప్ప‌గించాలి. పైగా.. పార్టీలో పెరుగుతున్న నాయ‌క‌త్వ మార్పుపై గుస‌గుస‌ల నేప‌థ్యంలో ఖ‌చ్చితంగా.. లోకేష్‌ను ముందుగా ప్ర‌మోట్ చేయాలి. అయితే.. ఆయ‌న‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాలంటే.. ఖ‌చ్చితంగా.. గెలిచి తీరాలి. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి ఓడిపోయిన లోకేష్‌పై పార్టీలో అంచ‌నాలు ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల్లో మాత్రం చాలా త‌క్కువ‌గా ఉన్నాయి.

ముఖ్యంగా నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల విష‌యంలో. లోకేష్ త‌న‌ను తాను నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇది నిరూపణం అయితే త‌ప్ప‌.. ఆయ‌న‌ను పార్టీ అధ్య‌క్షుడిగా.. నాయ‌కులు అంగీక‌రించే ప‌రిస్థితి లేదు. వెర‌సి.. పార్టీని న‌డిపించాలంటే.. లోకేష్ ముందుగా.. ఎక్క‌డ‌నుంచైనా కానీ.. గెలుపు గుర్రం ఎక్క‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యంపై సీనియ‌ర్లు కూడా కొన్ని సూచ‌న‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం పార్టీకి అనుకూలంగా ఉండే నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకుని.. ఇప్ప‌టి నుంచి క‌స‌ర‌త్తు చేయ‌డం మంచిద‌ని సూచిస్తున్నారు.

పార్టీ గెలిచినా.. ఓడినా.. దానిని చూసే కోణం డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు.కానీ, లోకేష్ గెలుపుపై మాత్రం పార్టీ భ‌విష్య‌త్ మొత్తం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అంటున్నారు. ఈ విష‌యంలో ఏ చిన్న పొర‌పాటు జ‌రిగినా.. లోకేష్ రాజ‌కీయ భ‌వితవ్యానికే కాకుండా.. పార్టీకి కూడా తీవ్ర సంక‌ట  ప‌రిస్థితి ఎదుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నారు. అంటే.. మొత్తానికి.. ఈ ఎన్నిక‌లు ఆ మాజీ మంత్రికి చావో రేవో..అనే మాట‌ టీడీపీలో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News