లోకేష్ vs వంశీ : తాగిన కోతి vs గొర్రెల డాక్టర్ !

Update: 2020-02-01 06:56 GMT
ప్రస్తుతం ఏపీ రాజకీయం మంచి కాకమీద ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుని మండలి లో టీడీపీ అడ్డుకోవడంతో వైసీపీ , టీడీపీ నేతల మధ్య మతాల యుద్ధం జరుగుతుంది. మీ అవినీతివల్లే రాష్ట్రము ఇలా తయారైంది అని వైసీపీ ఆరోపిస్తుంటే ,,,మీ తెలివి తక్కువ నిర్ణయాల వల్లే రాష్ట్రం అభివృద్ధి లో మరింతగా దిగజారుతోంది అని విమర్శలు చేస్తున్నారు . ఇదిలా ఉంటె గత కొన్ని రోజులుగా టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే .. వల్లభనేని వంశి , ఎమ్మెల్సీ , చంద్రబాబు తనయుడు లోకేష్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే రేంజ్ లో ట్విట్టర్ లో ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఇకపోతే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికీ కూడా ఇంకా టిడిపి ఎమ్మెల్యే అనే చెప్పాలి. అయన ఆఫీసియల్ గా వైసీపీలోకి జాయిన్ కాలేదు. కానీ , గత కొన్ని రోజుల నుండి అయన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పై హర్షం వ్యక్తం చేస్తూ ..సీఎం జగన్ కి జై కొడుతున్నారు. ఇదే సందర్భంలో లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్టీలో ఉన్నప్పుడు లోకేష్ అనేక ఇబ్బందులకు గురిచేశాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇలా వంశీ మరియు లోకేష్ ల మధ్య ట్వీట్ యుద్ధం నడుస్తుంది.

ఇక ఇదే సమయంలో ఎమ్మెల్సీ నారాలోకేష్ ...ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వం పై , టీడీపీ ఎమ్మెల్యే లపై సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ఎమ్మెల్యే ను మార్కెట్లో గొర్రెలని కోనట్టు కొంటున్నారని సీఎం పై ఆరోపణలు చేసారు. అలాగే సీఎం జగన్ గొర్రెలతో పాటుగా గొర్రెల డాక్టర్ ని కూడా కొన్నాడని పరోక్షంగా వంశీ పై విరుచుకుపడ్డాడు. ఈ వ్యాఖ్యలకి ఎమ్మెల్యే వంశీ కూడా అదే రేంజ్ లో లోకేష్ కి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగాన్ని పోగొట్టుకున్న తాగుబోతు కోతి అంటూ , పిచ్చి కుక్కలతో పోల్చుతూ ఎమ్మెల్యే వంశీ రెచ్చిపోయారు.
Tags:    

Similar News