బాక్సైట్‌పై వైసీపీ మాఫియా.. 15 వేల కోట్ల కుంభ‌కోణం.. లోకేష్ ఫైర్‌

Update: 2021-07-06 15:02 GMT
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా జ‌గ‌న్ స‌ర్కారుపై ఆయ‌న నిప్పులు చెరిగారు. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో వైసీపీ మైనింగ్ మాఫియా చెల‌రేగుతోంద‌ని.. దాదాపు 15 వేల కోట్ల రూపాయ‌ల బాక్సైట్‌ను దోచేసేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఉంద‌ని.. సంచ‌ల‌న కామెంట్లు  చేశారు.

``వైజాగ్‌లోని మ‌న్యం ప్రాంతంలో ఉన్న అంత్యంత విలువైన జాతి సంప‌ద‌ బాక్సైట్‌ను దోచేసేందుకు వైసీపీ మాఫియాకు జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం రెడ్ కార్పెట్ ప‌రిచింది. ఈ క్ర‌మంలోనే 30 అడుగుల వెడ‌ల్పుతో .. 14 కిలో మీట‌ర్ల మే.. అట‌వీ ప్రాంతంలో ర‌హ‌దారిని నిర్మించారు`` అని లోకేష్ విరుచుకుప‌డ్డారు. ఈ రోడ్డును కేవ‌లం 24 రోజుల్లోనే వైసీపీ ప్ర‌భుత్వం నిర్మించింద‌ని.. అదేస‌మ‌యంలో రోడ్డు నిర్మాణం కోసం.. ప‌చ్చ‌ని చెట్ల‌ను దాదాపు 10 వేల‌కు పైగా తెగ‌న‌రికేసింద‌ని.. నిప్పులు  చెరిగారు.

``వైసీపీ మాఫియాకు స‌హ‌క‌రిస్తున్న ప్ర‌బుత్వం.. దీనిపై క‌థ‌నాలు వెలుగు చూడ‌గానే సొల్లు క‌బుర్లు చెబుతోంది. మ‌న్యంలోని 250 గ్రామాల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకే రోడ్డు వేస్తున్నామ‌ని.. న‌క్క‌విన‌యాలు చూపుతోంది`` అన్నారు. ఇక‌, ఇదే విష‌యంపై టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాయుడు కూడా తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. లోకేష్ వాద‌న‌ను మ‌రింత బ‌లుపరుస్తూ.. ఆయ‌న కామెంట్లు చేశారు.

``మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు న‌డ‌యాడిన నేల అది. బ్రిట‌ష‌ర్ల‌పై పోరులో భాగంగా గెరిల్లా యుద్ద విద్య‌తో విరుచుకుప‌డిన ప్రాంతం ఇది. ఇప్పుడు దోపిడికీ గురవుతోంది!`` అని అచ్చెన్న వ్యాఖ్యానించారు. బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయ‌ని భావిస్తున్న మ‌న్యం అత్యంత చారిత్రాక‌మైందే కాకుండా.. జంతుజాలానికి ఆల‌వాల‌మైన ప్రాంత‌మ‌ని.. జీవ‌వైవిధ్యం ఇక్క‌డ నిరంత‌రం కొన‌సాగుతోంద‌ని టీడీపీ నేత‌లు పేర్కొన్నారు.  ఇదిలావుంటే,.. రాష్ట్ర గ‌నుల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి గోపాల కృష్ణ ద్వివేదీ మాత్రం.. రాష్ట్రంలో ఎక్క‌డా బాక్సైట్ త‌వ్వ‌కాలు జ‌ర‌గ‌డం లేదని తెలిపారు.  కొన్ని మీడియా సంస్థ‌లు అన‌ధికార వార్త‌లు.. నిరాధార వార్త‌లు.. ప్ర‌చారం చేస్తున్నాయ‌ని.. ఇలాంటివారికి కోర్టుకు లాగి.. ప‌రువు న‌ష్టం కేసులు వేస్తామ‌ని హెచ్చ‌రించారు. 
Tags:    

Similar News