రఘురామ వర్సెస్ పీవీ సునీల్...పీక్స్ లో వార్

ఉప సభాపతిగా రఘు రామ క్రిష్ణం రాజు కూటమి ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇక ఐపీఎస్ అధికారిగా పీవీ సునీల్ కుమార్ ల మధ్య వివాదంగా మొదలైనది కాస్తా ఇపుడు పీక్స్ లో వార్ గా మారిపోయింది.;

Update: 2025-12-23 12:09 GMT

ఉప సభాపతిగా రఘు రామ క్రిష్ణం రాజు కూటమి ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇక ఐపీఎస్ అధికారిగా పీవీ సునీల్ కుమార్ ల మధ్య వివాదంగా మొదలైనది కాస్తా ఇపుడు పీక్స్ లో వార్ గా మారిపోయింది. పీవీ సునీల్ కుమార్ మీద యాక్షన్ దాకా వ్యవహారాన్ని తీసుకుని వచ్చారు రఘురామ క్రిష్ణం రాజు. అయితే ఇపుడు రఘురామ కూడా ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనకు బ్యాంకులలో ఆయన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సుప్రీం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇలా పీవీ సునీల్ కి ఒక చాన్స్ వచ్చంది. దాంతో ఆయన రఘురామ మీద రివర్స్ లో ఎటాక్ మొదలెట్టారు. దీంతో ఈ ఇద్దరి మధ్యన మెల్లగా మొదలైన వార్ ఇపుడు బిగ్ రేంజికి చేరిపోయింది. ఇపుడు మొత్తం మ్యాటర్ అంతా కూటమి ప్రభుత్వం టేబిల్ మీద ఉంది. ఈ ఇద్దరి విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

ఫ్లాష్ బ్యాక్ ఇదే :

ఇంతకీ రఘురామకు పీవీ సునీల్ కి వివాదం ఏమిటి అంటే వైసీపీ ప్రభుత్వంలో ఆది నుంచి రెబెల్ ఎంపీగా ఉన్న రఘురామను సీఐడీ కస్టడీలోకి తీసుకున్నపుడు తనను టార్చర్ పెట్టారన్న దాని మీద అభియోగాలు మోపారు. ఫలితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు ఆయన విషయంలో పట్టుబట్టడంతో ఆ దిశగా చర్యలు కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం సిట్ విచారణను సునీల్ ఎదుర్కొంటున్నారు. మరో వైపు చూస్తే ఆ మధ్యన రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన వ్యవహారంలో పీవీ సునీల్ ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలా వ్యవహారం ఉన్న దశలో రఘురామ బ్యాంకుల విషయంలో తన ఆర్ధిక లావాదేవీలతో ఆరోపణలు ఎదుర్కొంటునది పీవీ సునీల్ ఎత్తి చూపిస్తున్నారు.

రఘురామను తప్పించాలి :

దీంతో ఇప్పుడు బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణంరాజుని వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని పీవీ సునీల్ కుమార్ వీడియో బైట్స్ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోఇగా రఘురామ మీద సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీవీ సునీల్ కుమార్ సోషల్ మీడియా ద్వారా వీడియో బైట్ ని రిలీజ్ చేయడమే కాకుండా పోస్టులు పెట్టడంతో ఈ ఇద్దరు వార్ తార స్థాయికి చేరినట్లు అయింది. అంతే కాదు తనను ఎలా తప్పించారో రఘురామను కూడా డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తప్పించాలని సునీల్ కుమార్ కోరడం కూడా చర్చనీయాంశమైంది. పీవీ సునీల్ అయితే రఘురామను గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ఆయన మీద వరసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

రఘురామ దూకుడు :

అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామ ఈ విషయంలో ఏ మాత్రం తగ్గడంలేదు. ఆయన కూడా పీవీ సునీల్ కుమార్ మీద ఏకంగా డీజీపీ హరీష్ గుప్తాకే ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ రూల్స్ కి విరుద్ధంగా పీవీ సునీల్ కుమార్ వ్యవహరిస్తున్నారు అని అందువల్ల ఆయనను ఏకంగా సర్వీసు నుంచే తొలగించాలని కోరుతూ ఫిర్యాదు చేయడం మరింత సంచలనం అయింది. దీంతో అందరి చూపూ డీజీపీ మీద పడుతోంది. నిజంగా డీజీపీ ఈ విషయంలో ఏమి చేస్తారు అన్నది సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఈ వ్యవహారం పతాక స్థాయికి చేరడంతో పీవీ సునీల్ కి మద్దతుగా దళిత సంఘాలే కాదు ఆ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు కూడా ముందుకు రావడంతో ఏమి చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. అయితే డీజీపీ ఈ విషయంలో కూటమి ప్రభుత్వంతో చర్చించి కానీ డెసిషన్ తీసుకోరని అంటున్నారు. అయితే అటు రఘురామ ఇటు పీవీ సునీల్ వ్యవహారం దాంతో కూటమికి ఇది కొత్త తలనొప్పిగా మారే పరిస్థితి ఉందా అన్న చర్చ అయితే ఉంది. రఘురామ పట్టుదల అందరికీ తెలిసిందే. అలాగే పీవీ సునీల్ విషయంలో కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. దాంతో వాట్ నెక్స్ట్ అన్నదే ఇపుడు అంతా ఆలోచిస్తున్న విషయంగా ఉంది.

Tags:    

Similar News