లాక్ డౌన్ తర్వాత తాజ్ కు కొత్త కష్టం.. ఇప్పుడు అలా ఉందట

Update: 2020-10-16 04:15 GMT
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహాల్ కు మరోసారి కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ అద్భుత కట్టడాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలని ప్రపంచ వ్యాప్తంగాప్రజలు కోరుకుంటారు. ఈ సుందర చిహ్నం..లాక్ డౌన్ వేళ.. కాలుష్యం నుంచి తెప్పరిల్లింది.

ఊహించని విధంగా విధించిన లాక్ డౌన్ తో తాజ్ పరిసరాల్లోని కర్మాగారాలు మూసివేయటం.. వాహన కాలుష్యం లాంటివి లేకపోవటంతో కాలుష్య కోరల్లో నుంచి తెప్పరిల్లింది. తాజ్ ను చూసేందుకు నిత్యం వేలాది మంది రావటం.. ఆగ్రా వీధులు రద్దీగా ఉండటంతో వాహన కాలుష్యం కారణంగా తాజ్ నిర్మాణానికి ప్రమాదం పొంచి ఉన్న సంగతి తెలిసిందే.

లాక్ డౌన్ వేళ.. ఇలాంటివేమీ లేకపోవటంతో తాజ్ మహాల్ బోసిపోయినట్లు కనిపించినా.. ఆ కట్టటానికి మాత్రం మరింత లైప్ పెరగటానికి కారణమైంది. అన్ లాక్ తర్వాత.. పరిశ్రమలు పెద్ద ఎత్తున మొదలు కావటంతో పరిశ్రమలు.. కర్మాగారాలతో పాటు.. నిర్మాణ రంగం షురూ కావటంతో తాజ్ మహాల్ ప్రమాదంలో పడినట్లుగా చెప్పాలి.

తాజ్ మహాల్ పై ధూళి మేఘాలు అలుముకున్నాయి. చుట్టూ ప్రమాదకర వాయువులు వ్యాపించాయి. దీంతో.. తాజ్ అందం మసకబారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. తాజ్ ను రక్షించుకోవాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. డెవలప్ మెంట్ కు ఇబ్బందే అయినప్పటికీ.. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఒక కట్టడాన్ని రక్షించుకోవటానికి ఆ మాత్రం కరకుగా వ్యవహరించటం తప్పదు.
Tags:    

Similar News