లాక్ డౌన్ ఎఫెక్ట్ : నష్టం పేరుతో ఉద్యోగాలు పీకేస్తున్న ప్రధాన పత్రికలు !

Update: 2020-04-03 06:50 GMT
కరోనా మహమ్మారి దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకువచ్చాయి. ఈ మహమ్మారిని దేశంలో అరికట్టాలంటే సామాజిక దూరం పాటించడం తప్ప మరో మార్గం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితులో , కొంతమంది ఇబ్బందులు పడతారని తెలిసినప్పటికీ కూడా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే , ఇదే నేపథ్యంలో ప్రతి సంస్థ కూడా ఉద్యోగులకి .. గతంలోలానే పూర్తి జీతాన్ని చెల్లించాలని కేంద్రం అందరికి ఆదేశాలు జారీచేసింది. అయితే, కేంద్రం ఆదేశాల్ని చిన్న చిన్న సంస్థలతో పాటుగా రెండు పెద్ద పత్రికా సంస్థలు కూడా పాటించడం లేదు.

లాక్ డౌన్ అమల్లోకి వచ్చి సరిగ్గా 10  రోజులు అవుతుంది. దీనితోనే జీతాలు సర్ధలేక ఉద్యోగులని తొలగిస్తున్న వైనం ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ మద్యే సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని  పార్టీలతో తో మిలాఖత్ అయ్యి కోట్ల యాడ్స్, రెవెన్యూ సంపాదించాయి. అయినా కూడా 10 రోజుల లాక్ డౌన్ నష్టాలను భరించలేకపోతున్నాయి. దీనితో మొన్నటివరకు లాభాలు పంచుకున్న పత్రికలు ఇప్పుడు లాక్ డౌన్ వల్ల కలిగే నష్టాలని కూడా భరించాలి కదా అని  జర్నలిస్టులు లోలోపల ప్రశ్నిస్తున్నారు. ఎడిషన్ల నుంచి యాడ్స్ రూపంలో  , సంవత్సరీకం రూపాన కోట్లకి కోట్లు మింగేసిన యాజమాన్యాలు ఇప్పుడు అవే ఎడిషన్లకు లాక్ డౌన్ తో యాడ్స్ రాకుంటే జీతాలు ఇవ్వలేము అంటూ ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తున్నారు.

తాజాగా ఉద్యోగులను తెలివిగా హోల్డ్ లో పెట్టడం పేరిట సాగనంపుతున్న వైనం కలకలం రేపుతోంది. మాకు గతంలో వచ్చిన లాభాలని మీరు అడగకండి ...మీరు చేసిన పనికి వచ్చే లాభాలే మాకు కావాలి ..మాకు గతంలో వచ్చిన లాభాల్లోని డబ్బుని తీసి మీకు జీతాలు మాత్రం ఇవ్వం అని ఖరాకండిగా చెప్తున్నాయి. ఇప్పుడు లాక్ డౌన్ నష్టాలను భరించలేమని.. ఉద్యోగులనే తీసేస్తున్న పరిస్థితి పత్రికల్లో కనిపిస్తోంది. ఈ కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచమే ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. పత్రికలను కరోనా భయంతో ఎవరూ చదవడం లేదు. వ్యాపార,వాణిజ్యాలు బంద్ కావడం తో పత్రికలకు ప్రకటనలు తగ్గి పోయాయి. ఇది ఒక ఆరు నెలల వరకు పత్రికలపై ప్రభావం చూపుతుంది.

జిల్లాల్లోనూ యాడ్స్ లేవు. ఇలాంటి కష్టకాలంలో మొన్నటి వరకు సంపాదించిన మొత్తం నుండి కొంచెం బయటకి  తీసి ఉద్యోగులకు జీతాలు ఇస్తే సరిపోతుంది. కానీ తాము రూపాయి తీయమని.. జర్నలిస్టుల ఉద్యోగాలే  తీయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లాక్ డౌన్ వల్ల వచ్చిన ఈ కష్ట కాలంలో ..తమ సంస్థ ఉద్యోగులకి అండగా నిలవాల్సింది పోయి , అదే లాక్ డౌన్ ను సాకుగా చూపి  తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాని పత్రికలు ఇప్పుడు ఉద్యోగులను ఇంటికి పేమిస్తున్నారు. తాజాగా రెండు ప్రధాన పత్రికలకు ఉద్యోగులకు ఈ మేరకు స్పష్టం చేశాయి. అందులో ఒకటి జీతాల్లో కోత విధిస్తూ సర్క్యూలర్ జారీ చేయగా.. ఇంకో ప్రధాన తెలుగు పత్రిక ఏకంగా 50శాతం రిపోర్టర్, డెస్క్ జర్నలిస్టులను తగ్గించేందుకు నిర్ణయించింది. 30శాతం మందితోనే డెస్కులు నడపాలని, మిగతా వారంతా కొన్ని రోజుల వరకు హోల్డ్ లో ఇంటివద్దే ఉండాలని ఆదేశించింది. దీనితో లాభాల బాటలో ఉన్నప్పుడు ఆనంద పడిన యాజమాన్యం, మేము కష్ట కాలంలో ఉన్నప్పుడు ఇలా ఉద్యోగాలు తీయడం ఎంత వరకు సమంజసం అంటూ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉద్యోగుల కష్టాలతో ఈ రోజు అగ్రస్థానంలో ఉన్న ఆ పత్రికలు ..లాక్ డౌన్ రూపంలో కొంచెం నష్టం రాగానే ..వారికీ అండగా ఉండకుండా , వారినే సాగనంపుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే , ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టు మిత్రులు మౌనంగా రోదించడం తప్ప  చేయగలిగింది ఏమీ లేదు.
Tags:    

Similar News