వీళ్లు సాధువులు కాదు.. దొంగలు
దైవాంశ సంభూతులుగా తమను తాము అభివర్ణించుకుంటూ.. భక్తి పేరుతో తమ మత్తులో మునిగిపోయేలా చేసే బాబాలు.. స్వామీజీల్లో మంచోళ్ల కంటే దొంగలే ఎక్కువగా ఉంటారు. తమ మాటల చాతుర్యంతో.. చేతలతో లక్షలాది మందిని పిచ్చోళ్లను చేసే స్వాములు మనచుట్టూ చాలామందే ఉన్నారు.
పెద్ద పెద్ద స్థానాల్లో ఉండే ప్రముఖులు సైతం వంగి.. వంగి వినయ విధేయతలతో వ్యవహరించే తీరుతో చాలామంది అమాయక ప్రజలు దొంగ బాబాలు.. స్వామీజీల మత్తులో మునిగిపోతుంటారు. తియ్యటి మాటలు చెప్పి.. ఆరాచకాలకు పాల్పడే ఈ దొంగ స్వాముల లీలలు ఇప్పటికి చాలానే వచ్చాయి.
మొన్నటికి మొన్న డేరా బాబా అసలు రంగు బయటకు వచ్చి దేశ ప్రజల్ని అవాక్కు అయ్యేలా చేసింది. కోట్లాది మంది ప్రజల్ని తన భక్తులుగా చేసుకొని పూజలందుకున్న డేరా బాబా.. పచ్చి మోసగాడని.. సెక్స్ బానిస అన్న విషయం బయటపడటమే కాదు.. ఇద్దరు సాద్వీలను అత్యాచారం చేసిన కేసులో దోషిగా నిరూపితమై జైల్లో జీవితాన్ని గడుపుతున్నారు.
ఇలాంటి దొంగ స్వాముల విషయాన్ని ఇకపై ఎప్పటికప్పుడు అలెర్ట్ చేయాలని భావిస్తోంది అఖిల భారతీయ అఖాడా పరిషత్. అంతేకాదు.. ఈదొంగ స్వాములపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతుంది కూడా. తాజాగా దొంగ స్వాములకు సంబంధించి ఒక జాబితాను బయట పెట్టారు. దొంగ స్వాములకు చెక్ పెట్టేందుకు వీలుగా తాజాగా 13 మందితో కూడిన ఒక జాబితాను విడుదల చేసింది అఖిల భారతీయ అఖాడా పరిషత్.
ఆ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయంటే..
1. ఆసారాం బాపూ
2. రాధేమా
3. సచ్చిదానంద్ గిరి ఎలియాస్ సచిన్ దత్తా
4. గుర్మీత్ రాంరహీం సింగ్
5. ఇచ్చాధారి భీమానంద్
6. మల్ఖన్ సింగ్, నారాయణ్ సాయి
7. రాంపాల్
8. ఆచార్య ఖుష్‌మురి
9. స్వామి అసీమానంద్
10. బృహస్పతి గిరి
11. ఓం నమః శివాయ బాబా
12. నిర్మల్ బాబా
13. ఓం బాబా