మరో ముప్పు.. కాంతి కాలుష్యం కోరల్లో భాగ్యనగరం!
హైదరాబాద్ నగరానికి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అందాల భాగ్యనగరంలో ఉండి వినీలాకాశంలో తారలను చూడలేకపోతున్నాం. చూడచక్కని చుక్కల్లో అందంగా ఆకాశం కనిపించే పరిస్థితులు లేవు. ఎందుకంటే భాగ్యనగరం కాలుష్యం కోరల్లో చిక్కి.. విలవిల్లాడుతోంది. ఈ కాలుష్య భూతం కూడా అనేక రూపాల్లో హైదరాబాద్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది వరకు గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం తో పాటు ఇప్పుడు కాంతి కాలుష్యం రక్కసి కూడా భాగ్యనగరాన్ని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఆకాశంలోని తారలు ఇక్కడి ప్రజలకు కనిపించే అవకాశం లేదని వాతావరణ నిపుణులు అంటున్నారు.
2014-2017 సంవత్సరాల్లోని మధ్య కాలంలో కాంతి కాలుష్యం పై శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేపట్టింది. కాగా వీటిలో దేశంలో ఎనిమిది నగరాల్లో ఈ కాంతి కాలుష్యం సమస్య తీవ్రంగా ఉందని వారు తేల్చారు. లైట్ పొల్యూషన్ తీవ్రతను లూమినస్ ఇంటెన్సిటీ యూనిట్లలో కొలుస్తారు. కాగా ఇందులో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. సీఎంటీయూ అధ్యయనంలో హైదరాబాద్ లో 7,790 యూనిట్లుగా టాప్ ప్లేస్ లో ఉంది. ఇక తర్వాతి స్థానంలో కోలకత్తా 7,480 యూనిట్లు, ఢిల్లీ 7,270 యూనిట్లుగా నమోదైనట్లు శాస్త్రవేత్తలు తమ నివేదికలో పొందుపరిచారు.
శాటిలైట్ చిత్రాల ద్వారా దేశంలోని నగరాలు కాంతి కాలుష్యం తీవ్రతను అంచనా వేశారు. కాగా పై మూడు నగరాల తర్వాత చెన్నై, ముంబై, అహ్మదాబాద్ ఉన్నాయి. ఇక ఎనిమిది నగరాల్లో 2,190 యూనిట్లతో భువనేశ్వర్ ఆఖరి స్థానంలో ఉంది. అక్కడ కాంతి కాలుష్యం కాస్త స్వల్పంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎల్ఈడీ లైట్ల వినియోగం వల్ల ఈ కాంతి కాలుష్యం తీవ్రంగా పెరిగిందని వారు చెప్పారు. ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్, కలకత్తా, ఢిల్లీలో రికార్డు స్థాయిలో నమోదైందని అభిప్రాయపడ్డారు.
మితిమీరిన స్థాయిలో ఎల్ఈడీ లైట్లు వినియోగిస్తున్నారని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటివల్ల కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశం మొత్తం ఇదే స్థాయిలో ఎక్కువగా వాడుతున్నారని గుర్తించారు. కాంతి కాలుష్యానికి వీధి దీపాలు, హైవేల మీద లైట్లే 43శాతం కారణంగా పేర్కొన్నారు. ఇకపోతే వీధిలైట్లు, అపార్టుమెంట్లలో విద్యుత్ దీపాలు ఇలా రకరకాలుగా ఎల్ఈడీ బల్బులు మోతాదుకు మించి వాడుతున్నామని అన్నారు. వీటివల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇకనైనా కాస్త తగ్గించాలని సూచించారు.