ఆ ఉగ్రవాదికి జీవిత ఖైదు

Update: 2020-08-27 10:10 GMT
ప్రశాంత దేశం న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో గత ఏడాది మసీదుల్లో జాత్యాంహకారంతో కాల్పులకు తెగబడి 51మందిని చంపేసిన దుండగుడు బ్రెంటన్ టారెంట్ కు జీవిత ఖైదు పడింది. ఈ ఉగ్రవాది సృష్టించిన మారణకాండను ప్రపంచం మరిచిపోలేదు. బ్రెంటన్ టారంట్ అనే వ్యక్తి రెండు మసీదుల్లోకి వెళ్లి  మారణహోమం సృష్టించాడు.
 
 క్రైస్ట్ చర్చ్ మసీదుల్లో 51మందిని చంపిన బ్రెంటాన్ పై అభియోగాలు మోపారు. ఈ హత్యాకాండను లైవ్ టెలికాస్ట్ కూడా చేశాడు.  ఇది తీవ్రమైన నేరం కావడంతో అతడికి చనిపోయేవరకు జైల్లోనే ఉండేలా జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

అయితే 51 మందిని చంపిన బ్రెంటన్ ను ఉరి తీయాలని మృతుల బంధువులు ఆందోళన నిర్వహించారు. అయితే న్యూజిలాండ్ దేశంలో మరణశిక్ష అమల్లో లేకపోవడంతో చనిపోయే వరకు జీవిత ఖైదు విధించారు.
Tags:    

Similar News