యూకే లో భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు .. ఏంచేసాడంటే ?
భార్యని అత్యంత కిరాతకంగా చంపిన ఓ భారత సంతతికి చెందిన వ్యక్తికి యూకే కోర్టు జీవిత ఖైదు విధించింది. భార్యని చంపడం.. జాలి, దయ లేకుండా చేసిన దారుణ హత్య. ఎంతో భవిష్యత్తున్న ఓ యువతి ప్రాణాలు తీశావు. ఆమె తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తెను దూరం చేసి, తీరని దుఃఖం కలిగించావు. అని న్యాయమూర్తి జస్టిస్ టిమోతీ స్పెన్సర్ బుధవారం నాటి తీర్పు సందర్భంగా కుమార్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. జిగుకుమార్, భావినిల వివాహం 2017లో జరిగింది. 2018లో కుమార్ ఆమెను తనతో బ్రిటన్ కు తీసుకెళ్లాడు. అయితే ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు రావడంతో వారు విడివిడిగా నివశిస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా మార్చి 2 మధ్యాహ్నం 12:30 గంటలకు జిగుకుమార్ ఆమె ఇంటికి వెళ్లాడు. కొద్ది నిముషాలు మాట్లాడిన అనంతరం ఆమెపై కత్తితో పలుమార్లు దాడిచేసి, అక్కడి నుంచి పారిపోయాడు. వైద్య సహాయం అందించేందుకు వచ్చిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. అంతేకాకుండా పోలీసుల దగ్గరకు పరుగెత్తుకెళ్లి.. జరిగిన విషయాన్ని వారికి చెప్పాడు. దీంతో జిగుకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు పై విచారణ జరిపిన కోర్టు.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
గుజరాత్ కు చెందిన జిగు కుమార్ సోర్థి అనే యువకుడికి కనీసం 28 సంవత్సరాలు జైలులో గడపాల్సిందిగా బ్రిటన్ న్యాయస్థానం ఆదేశించింది. ఆ తర్వాత మాత్రమే పెరోల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని లైసెస్టర్ షైర్ క్రౌన్ కోర్టు స్పష్టం చేసింది.