• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బెజవాడ లో హెల్మెట్...

బెజవాడ లో హెల్మెట్ లేకుండా బండి నడిపితే లైసెన్స్ సస్పెండ్

By - Tupaki Desk
Update: 2019-12-18 06:54 GMT
అంతకంతకూ పెరిగి పోతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యం లో ఏపీ రవాణా శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే ఏడాది మొదటి రోజు (జనవరి 1 నుంచి) నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. దీని ప్రకారం బెజవాడ రోడ్ల మీద టూవీలర్ ను హెల్మెట్ లేకుండా నడిపితే.. వారి డ్రైవింగ్ లైసెన్స్ లను సస్పెండ్ చేయాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ప్రతి వందమందిలో ముప్ఫై మంది హెల్మెట్ లేని కారణంగా ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని గుర్తించిన ఏపీ రవాణా శాఖ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విజయవాడలో ఐదు లక్షల టూవీలర్స్ ఉన్నాయి. ఇందులో 60 శాతం మంది వాహనదారులు హెల్మెట్ లేకుండానే బండ్ల ను తీసుకొని రోడ్ల మీదకు వస్తున్నారు.

ఈ కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాల కు గురికావటం.. ప్రాణాలు పోవటం జరుగుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు వీలుగా తాజాగా కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. జనవరి ఒకటి నుంచి విజయవాడ రోడ్ల మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు పోలీసులు. ఎవరైనా హెల్మెట్ లేకుండా టూవీలర్ నడిపితే వారి మీద కేసులు నమోదు చేయటంతో పాటు.. నెల రోజుల పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేశారు. అదే తప్పు మరోసారి రిపీట్ అయితే.. కేసు నమోదు చేసి అరెస్ట్ చేయటమే కాదు.. వాహనాన్ని సైతం సీజ్ చేయనున్నారు. మొత్తానికి జనవరి ఒకటి నుంచి బెజవాడలో టూ వీలర్ వాడాలంటే తలకు హెల్మెట్ తప్పనిసరి. లేకుంటే తిప్పలు తప్పవంతే.
Tags:    
  • Andhra News 
  • Andhra Politics 
  • Andhra Pradesh News 
  • Andhra Pradesh Political Updates 
  • License suspended for driving without a helmet in Bejawada 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS