వీరమాచినేనికి డాక్టరేట్: బాబు గోగినేని పంచుల వర్షం!
ప్రముఖ డైటీషియన్ వీరమాచినేని రామకృష్ణకు గుంటూరు జిల్లా విజ్ఞాన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఈ విషయం ఇప్పుడు వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. డైట్ కు సంబంధించి ఆయన చేసిన కృషికి విజ్ఞాన వర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు విజ్ఞాన్ వర్సిటీ తెలిపింది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్.. ప్రముఖ హేతువాది బాబు గోగినేని తాజాగా దీనిపై పంచుల వర్షం కురిపించారు. గట్టి కౌంటర్లు ఇచ్చాడు. ‘అసలు మన దగ్గర డయాబెటీస్ లేదని చెప్పిన వ్యక్తికి డాక్టరేట్ ఏంటని ’ బాబు గోగినేని ప్రశ్నించారు. కరోనాకు వంటింటిపోపుల డబ్బా పరిష్కారం అన్నాడని.. మరి వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నాడని వీరమాచినేనిని బాబు గోగినేని నిలదీశాడు.
మాస్క్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదన్న వ్యక్తి స్పుత్నిక్ వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నట్లు అని బాబు గోగినేని ప్రశ్నించాడు. వీరమాచినేని చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అంటూ గోగినేని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ కరోనా సూచనలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే వీరమాచినేనికి డాక్టరేట్ ఇవ్వడం ఏంటి? అని గౌరవ డాక్టరేట్లకున్న గౌరవాన్ని తగ్గించడమేనని హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకట సుబ్బయ్య అన్నారు.
డాక్టరేట్లు వచ్చిన వారందరూ డాక్టర్లు అవుతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన యూజీసిని కోరుతున్నారు.