• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ యాక్షన్ ప్లాన్ పై...

పవన్ యాక్షన్ ప్లాన్ పై నీళ్లు చల్లారు

By - Tupaki Desk
Update: 2019-11-02 10:03 GMT
ఒకే దెబ్బకు చాలా పిట్టలు సామెత అమలు చేయాలని యోచించిన జనసేనానికి గట్టి దెబ్బతగిలిందా..? లాంగ్ మార్చ్ తో ఏపీలోని పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తీసుకురావాలనే ప్లాన్ బెడిసికొట్టిందా? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ వర్సెస్ జనసేనతోపాటు మిగతా పార్టీలన్నింటిని మహాకూటమిగా చేయాలన్న జనసేనానికి చుక్కెదురైందా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

నవంబర్ 3న జనసేనాని పవన్ విశాఖలో తలపెట్టిన 'లాంగ్ మార్చ్' ద్వారా ఏపీలోని ఇసుక కొరతను ఎలుగెత్తి చాటడానికి పూనుకున్నారు. అయితే పవన్ చేపట్టిన ఈ నిరసన  వెనుక అసలైన రాజకీయ వ్యూహం కూడా ఉందని పార్టీలన్నీ అనుమానించాయి. లాంగ్ మార్చ్ కేవలం ఇసుక కొరతపై మాత్రమే కాదని.. ఏపీలోని పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చి వైసీపీపై పోరాటం చేయడం ముఖ్య ఉద్దేశమని భావించారట.. పవన్ కళ్యాణ్ పన్నిన ద్విముఖ వ్యూహాన్ని ఏపీలోని పార్టీలన్ని గ్రహించి తప్పుకోవడంతో ఇప్పుడు పవన్ ప్లాన్ బెడిసికొట్టింది. ఒంటరిగా మారిపోయారు.

పవన్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ముందుగా బీజేపీ ఈ లాంగ్ మార్చ్ కు సంఘీభావం తెలిపింది. అయితే ఆ తర్వాత  బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫ్టేట్ ఫిరాయించాడు. తమ మద్దతు కేవలం ఈ ఇసుక ఆందోళనకే కానీ.. జనసేనకు కాదని క్లారిటీ ఇచ్చారు. జనసేన లాంగ్ మార్చ్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని అనుమానించిన బీజేపీ ఇలా పవన్ కు షాకిచ్చిందన్న చర్చ మొదలైంది.

అయితే బీజేపీని లాంగ్ మార్చ్ కు ఆహ్వానించడం వామపక్షాలకు కోపం తెప్పించింది. పవన్ తో ఇన్నాళ్లు కలిసి నడిచిన వారు బీజేపీని ఆహ్వానించడంతో నొచ్చుకొని లాంగ్ మార్చ్ కు తాము హాజరుకాలేమంటూ పవన్ లేఖ రాసి షాకిచ్చాయి.

ఇక పవన్ తో సన్నిహితంగా మెలుగుతున్న చంద్రబాబు జనసేన లాంగ్ మార్చ్ కు మద్దతు ప్రకటించారు. టీడీపీ ముఖ్యనేతలు ఇందులో పాల్గొంటారని తెలిపారు. ఇలా బీజేపీ, వామపక్షాలు యూటర్న్ తీసుకోవడంతో పవన్ తన పాత మిత్రుడు టీడీపీ మాత్రమే లాంగ్ మార్చ్ లో మిగిలాయి. అందరినీ గాటునకట్టి వైసీపీపై యుద్ధం చేస్తామని పవన్ యోచిస్తే అది పార్టీలు పసిగట్టి దూరం జరిగాయన్న చర్చ సాగుతోంది.
Tags:    
  • Janasena 
  • Janasena Chief Pavan Kalyan 
  • Powerstar PavanKalyan 
  • Pavan Kalyan Leaders 
  • Pavan Kalyan Vizag Rally 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS