చంద్రబాబును జైలుకు పంపే వరకు వదలను: లక్ష్మీపార్వతి
టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో ‘ఎన్టీఆర్ ఎపిసోడ్’ మాయని మచ్చగానే మిగిలిపోతోంది. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ నే గద్దెదింపి తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకొని ఆయన గుండెపోటుతో మరణించడానికి పరోక్ష కారణమయ్యాడని చంద్రబాబును ఇప్పటికీ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సతీమణి ‘లక్ష్మీపార్వతి’ ఈ మొత్తం వివాదానికి కేంద్రం బిందువుగా.. ప్రధాన సాక్షిగా ఉన్నారు.
అయితే ప్రస్తుతం వైసీపీ పార్టీలో కొనసాగుతున్న లక్ష్మీపార్వతి సుప్రీం కోర్టు నేతలపై కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరపాలని ఆదేశించడంతో చంద్రబాబుపై తాను పెట్టిన పాత కేసును తవ్వి తీస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబును వదలనంటూ తాజాగా శపథం చేశారు.
తాజాగా చంద్రబాబుపై సీనియర్ ఎన్టీఆర్ సతీమణి, ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును జైలుకు పంపించేంత వరకు వదలను అంటూ ఆమె అన్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమాస్తుల కేసును విత్ డ్రా చేసుకునే ఉద్దేశం తనకు లేదని.. తాను కేసును విత్ డ్రా చేసుకోవాలంటూ చంద్రబాబు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె వెల్లడించారు.
నిన్న హైదరాబాద్ ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఆస్తులకు సంబంధించి విచారణ జరిగింది. దీనికి పిటీషన్ దారుగా హాజరైన లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాక్యలు చేశారు. కొందరు కేసును విత్ డ్రా చేసుకోవాలంటూ తనపై ఒత్తిడి పెంచుతున్నారని.. తనకు మాత్రం కేసును విత్ డ్రా చేసుకునే ఉద్దేశం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు.
తనకు ఏసీబీ కోర్టులో న్యాయం జరగని పక్షంలో హైకోర్టుకు వెళతానని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.. చంద్రబాబును జైలుకు పంపకుండా వదలనని.. న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారని.. ఆయన ఆస్తులపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని ఆమె పేర్కొన్నారు.
1978 నుంచి 2005 వరకు చంద్రబాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టుకు సమర్పించారు. ఏసీబీ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.