వీడియో వైర‌ల్ః అంద‌రూ చూస్తుండ‌గా బ‌ట్ట‌లు ‌మార్చుకున్న లేడీ‌!

Update: 2021-04-07 13:11 GMT
చుట్టూ జ‌నం ఉన్నారంటే.. నిత్యం దుస్తులు స‌ర్దుకుంటూ ఉంటారు మ‌హిళ‌లు. అలాంటిది.. అంద‌రూ చూస్తుండ‌గానే త‌న డ్రెస్ ఛేంజ్ చేసుకుందో లేడీ. అదికూడా ఓ స్టేజ్ మీద‌! ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

సినిమా ప్రొడ్యూస‌ర్ శిరీష్ కుంద‌ర్ త‌న ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో ఓ జంట డ్యాన్స్ చేయ‌డానికి స్టేజ్ మీద‌కు వ‌చ్చింది. అయితే.. ఇద్ద‌రూ అపోజిట్ డ్రెస్ లో వ‌చ్చారు. ఈ విష‌య‌మై 'సేమ్ డ్రెస్ వేసుకు రాలేదు ఎందుకు?' అని ఆమె డ్యాన్స్‌ పార్టనర్ అడుగుతాడు. స్టేజ్ మీదకు వెళ్లిన తర్వాత చూద్దువుగానీ పద అంటుంది.

ఆ త‌ర్వాత ఇద్ద‌‌రూ డ్యాన్స్ మొద‌లు పెడ‌తారు. అయితే.. డ్యాన్స్ చేస్తుండ‌గానే లేడీ పార్ట‌న‌ర్ డ్రెస్ మార్చేసుకుంది. బ్లూ క‌ల‌ర్‌ డ్రెస్ కాస్తా.. బ్లాక్ క‌ల‌ర్ విత్ గోల్డ్ డిజైన్లోకి మారిపోయింది. ఇది చూసిన పార్ట‌న‌ర్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేశాడు. అంద‌రూ చ‌ప్ప‌ట్లతో అభినందించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.
Tags:    

Similar News