అభినందన్ ప్రశంస సరే..మీడియాపైనా పంచ్ లా కేటీఆర్?
విమర్శకు ఒక సమయం సందర్భం ఉంటుంది. కానీ.. తెలివైన రాజకీయ నేతలు సమయాన్ని తమకు తామే సృష్టించుకుంటారు. తమ మనసులోని మాటను చెప్పే క్రమంలో అవకాశాన్ని ఎవరికి వారుగా సృష్టించుకోవటం.. తాజా పరిణామాలపైన స్పందిస్తూనే.. తమ ఎజెండా ప్రకారం పంచ్ లు వేయటం ఈ మధ్యన ఎక్కువైంది.
ఇప్పుడు ఆ కోవలోకే వస్తుంది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. భారత్-పాక్ ల మధ్య నడుస్తున్న ఉద్రిక్తల వేళ.. వింగ్ కమాండర్ అభినందన్ వర్దన్ పాక్ దళాలకు చిక్కటం.. ఈ సందర్భంగా తనకు సంబంధించిన సమాచారాన్ని ఆయన వెల్లడించకపోవటం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. అభినందన్ మామూలుగా దొరికిపోలేదని.. పాక్ కు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చేసే క్రమంలో దురదృష్టం వెంటాడి అతడు చిక్కుకుపోయిన వైనం బయటకు వచ్చింది. పాక్ చెరలో ఉన్న అభినందన్ మీద యావత్ భారతావని మొత్తం ప్రశంసల జల్లు కురుస్తుంది. అతని సాహసాన్ని వేనోళ్లు పొగిడేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా కేటీఆర్ సైతం ట్వీట్ చేశారు. అభినందన్ సాహసాన్ని కీర్తిస్తూ ఆయన ట్వీట్ పోస్ట్ చేశారు. పాకిస్థాన్ సైన్యానికి బందీగా చిక్కిన భారత వైమానిక దళం పైలట్ అభినందన్ వర్ధమాన్ ధైర్యసాహసాలను కేటీఆర్ అభినందించారు.
ఓ పక్క దేశంలో స్వార్థ రాజకీయాలు.. టీఆర్పీ రేటింగ్స్ లో మీడియాలో యుద్దాలు జరుగుతుంటే.. గాయాలపాలై ప్రత్యర్థికి చిక్కిన ఇండియన్ పైలట్ అభినందన్ ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ఉంటూ దేశ రహస్యాలు వెల్లడించేందుకు నిరాకరించారు. విపత్కర పరిస్థితుల్లోనూ గొప్ప ధైర్య సాహసాల్ని.. హుందాతనాన్ని ప్రదర్శించిన అభినందన్ కు నా సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. అభినందన్ నా హీరో.. అతన్ని స్వదేశం తీసుకురండి అంటూ హ్యాష్ ట్యాగ్ లు జోడించారు.
అంతా బాగానే ఉంది. అభినందన్ ను.. అతడి సాహసాన్ని కీర్తించటం తప్పేం కాదు. ఆ సందర్భంలో రాజకీయాల్ని.. మీడియా వార్ ను ప్రస్తావించటం చూస్తే.. తన ఎజెండాకు అభినందన్ ఎపిసోడ్ తో లింక్ చేయటం సరికాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.