కేటీఆర్ కు హెల్త్ ప్రాబ్లం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడిగా పరిచయమై.. అనతి కాలంలో తనకంటూ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పదునైన మాటలు.. ప్రత్యర్థులపై విరుచుకుపడే తత్త్వంతో పాటు.. మాటల్లో ఎక్కడా దొరక్కుండా ఉంటూ.. తెలంగాణ పవర్ సెంటర్ గా పేరున్న ఆయన.. సోమవారం జరిగిన రెండు ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరు కాలేదు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారోత్సవానికి.. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ సమావేశానికి ఆయన హాజరు కాలేదు. రెండు ముఖ్యమైన కార్యక్రమాలకు కేటీఆర్ హాజరు కాకపోవటంపై ఆసక్తికర చర్చ నడిచింది. ఇదిలా ఉంటే.. ఆయన రాకపోవటానికి కారణం ఆయన ఆరోగ్య ఇబ్బందులే అన్న విషయం బయటకు వచ్చింది.
కళ్లజోడుతో ఉన్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కేటీఆర్.. తనకు బాంబే ఐస్ (కండ్ల కలక) ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కళ్లకు ఇబ్బందిగా ఉండి వైద్యుల వద్దకు వెళ్లగా.. కండ్ల కలక సోకిందని చెప్పి.. మందులు ఇచ్చారు. మూడు.. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలంటూ సూచించారు. దీంతో.. ఆయన కార్యక్రమాలకు హాజరు కాకుండా ఉండిపోయారు. వైద్యుల సూచన మేరకు తన నివాసంలో సోమవారం మధ్యాహ్నం నుంచి విశ్రాంతి తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోనుఆయన ట్వీట్ రూపంలో పంచుకున్నారు. కేటీఆర్ లాంటి పెద్ద మనిషికి ఆరోగ్యం బాగోని వేళ.. పరామర్శలు చేయాల్సిన బాధ్యత ప్రముఖుల మీద ఉన్నట్లే. చూస్తుండండి.. సోషల్ మీడియాలో ఆయనకు పరామర్శల వెల్లువెత్తటం ఖాయం.