టీడీపీ చచ్చిపోయింది..కాంగ్రెస్ శని: కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోమారు విపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ సహా ఇప్పటికే వరుస షాకులతో ఉన్న టీడీపీపై శివాలెత్తారు. నల్లగొండ జిల్లా టీడీపీ నేతలు కంచర్ల భూపాల్ రెడ్డి - కంచర్ల కృష్ణారెడ్డితో పాటు ఎంపీటీసీలు - సర్పంచ్ లు - నాయకులు - కార్యకర్తలు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ
తెలంగాణలో టీడీపీ పార్టీ చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ దేశానికి - రాష్ర్టానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ విమర్శించారు.
తాము తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ ప్రకటించడం చూస్తుంటే నవ్వొస్తుందని కేటీఆర్ అన్నారు. ఆంధ్రా - తెలంగాణను బలవంతంగా కలిపింది కాంగ్రెస్ పార్టీ కాదా..? అని ప్రశ్నించారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను పిట్టల్లా కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌ది కాదా..? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో ప్రజల నడుములు విరుగుతుంటే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ ఎప్పుడన్నా పట్టించుకున్నారా..? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలు ఎన్నిసార్లొచ్చినా కాంగ్రెస్‌కు ఘోరపరాజయం ఎదురైందన్నారు.
నల్గొండ జిల్లా ప్రజల గోసను ఢిల్లీ వరకు వినిపించిన ఘనత సీఎం కేసీఆర్ దని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. టీఆర్ ఎస్ నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా కంచర్ల భూపాల్ రెడ్డిని ప్రకటించమని సీఎం కేసీఆర్ చెప్పారని వెల్లడించారు. ఇప్పటి వరకు ఇంచార్జిగా ఉన్న దుబ్బాక నర్సింహారెడ్డికి రాష్ట్రస్థాయిలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారని తెలిపారు. సమైక్య పాలనలో నల్గొండ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే గత నాయకులు ప్రశ్నించలేదని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.