• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఐటీ మంత్రి అంటే అలాగే...

ఐటీ మంత్రి అంటే అలాగే ఉండాలి

By - Tupaki Desk
Update: 2017-05-13 05:57 GMT
తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్‌ అకౌంట్‌ కాస్త ఫిర్యాదుల బాక్సుగా మారిపోయిందట. మొదట్లో తన పర్యటన వివరాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియచెప్పేందుకు వారధిగా కేటీఆర్‌ ట్విటర్‌ అకౌంట్‌ ను వాడుకునే వారు. రానురాను ఇది కాస్త సమస్యల పరిష్కార వేదికగా తయారైంది. నెటిజన్లు ఎలాంటి అభ్యర్థనలు పంపినా, సూచనలు చేసినా మంత్రి తక్షణమే స్పందించి సంబంధిత అధి కారులకు ఆ సమాచారాన్ని పంపించి పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు.  దీంతో ఐటీ మంత్రి అంటే అలాగే ఉండాలని... టెక్నాలజీ విషయంలో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ టెక్నాలజీని ప్రజోపయోగ పనుల కోసం ఎలా ఉపయోగించాలో కేటీఆర్ చేసి చూపిస్తున్నారని అంటున్నారు. సోషల్ మీడియాను ఇంతలా ప్రజల మంచి కోసం వాడొచ్చని చూపిన మంత్రి కేటీఆరేనని చెబుతున్నారు. ఇతర రాష్ర్టాల యువ ఐటీ మంత్రులు కూడా ఇలాంటి విధానాలు ఫాలో కావాలని సూచిస్తున్నారు.
    
నాలుగు రోజుల కిందట వర్షం కురిసినప్పుడు  నగరంలో ఎక్కడ సమస్య ఉత్పన్నమైందో, వర్షపునీళ్ళు ఎక్కడ నిలిచాయో, చెట్లు ఎక్కడ పడిపోయాయో తెలియజేస్తూ నెటిజన్లు క్షణంక్షణం కేటీఆర్‌ కు సమాచారాన్ని పంపించారు. తన కు వచ్చిన ప్రతి సందేశాన్ని స్వీకరించిన కేటీఆర్‌ వాటన్నింటిని జీహెచ్‌ ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డికి పంపించడం తో పాటు వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదే శించారు. అలా మంగళవారం ఒక్కరోజే కేటీఆర్‌ ట్విటర్‌ ఖాతాకు వేలాది ఫిర్యాదులు అందాయి. అందులో ఒక్క దాన్ని కూడా విస్మరించకుండా అన్నింటికి బదులిచ్చారు. ఆయా సమస్యలకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేశారు.
    
హైదరాబాద్‌ తో పాటు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఎక్కడి నుంచి ఎవరు ఏ సమస్య పంపినా ఆయన పరిష్కరిస్తున్నారని చెబుతున్నారు. తాను ఆన్‌లైన్‌లో ఉండడమే కాకుండా జీహెచ్‌ ఎంసీ - ఎలక్ట్రిసిటీ బోర్డు - సీవరేజ్‌ - హెచ్‌ ఎండీఎ విభాగాలను ఆన్‌ లైన్‌ లో ఉండేలా అప్రమత్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • KTR 
  • GHMC 
  • Twitter 
  • Telugu NEWs 

Similar News

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

Copyright @2026

Powered by Blink CMS