నాన్న దగ్గర అన్ని నేర్చుకుంటున్నారుగా కేటీఆర్
రాజకీయం అన్నది ఒకప్పుడు అదో బ్రహ్మపదార్థంలా ఉండేది. కొద్దిమందికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకమైన కళగా భావించేవారు. ఎన్టోవోడు పుణ్యమా అని.. అదంతా మారిపోయి.. సగటు జీవి సైతం కూర్చొని మాట్లాడుకోవటం.. వ్యూహాల్ని.. ఎత్తుగడల్ని గుర్తించే వరకు వెళ్లింది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యానికి కారణం నందమూరి తారక రామారావుగానే చెప్పాలి. ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాతే తెలుగు నేల మీద రాజకీయం రూపం..రంగు మొత్తంగా మారిపోయాయి. తెలుగు రాజకీయాల్ని చూస్తే.. 1983 ముందు ఒకలా.. తర్వాత ఒకలా కనిపిస్తాయి.
అలా మారిన రాజకీయం కాలానికి తగ్గట్లు రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు గతానికి భిన్నంగా మారాయి. అధికరపక్షంలోని వారు అంతులేని శక్తివంతులుగా వ్యవహరిస్తున్నారు. విపక్షంలో ఉన్న వారు బలంగా గొంతెత్తలేకపోతున్న పరిస్థితి. ఒకవేళ.. ఎత్తినా అందుకు ఎదురవుతున్న సవాళ్లు అన్ని ఇన్ని కావు. విపక్షాల్ని ఎప్పటికప్పుడు బలహీనపర్చటమే కాదు.. తమ అధిక్యాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తున్నాయి అధికారపక్షాలు. అదే సమయంలో.. సామాన్యుల విషయంలో అంతులేని దయ.. కరుణను ప్రదర్శిస్తున్నాయి. నాటకీయ పరిణామాలకు ఏ మాత్రం కొదవ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
తాను వెళుతున్న దారిలో కనిపించిన ఒక గ్రామాన్ని చూసినంతనే ఆగి.. ఆ ఊరి గురించి వివరాలు తెలుసుకొని.. దాన్ని దత్తత తీసుకోవటమే కాదు.. ఆ చిన్న గ్రామానికి వందల కోట్లు కేటాయిస్తానని ముఖ్యమంత్రి మాట ఇవ్వటం ఏమిటి? ఆ ఊరి వారందరిని ఒకచోట కూర్చోబెట్టి మీటింగ్ పెట్టటమే కాదు.. ఊరు మొత్తానికి మాంచి విందును ఎరేంజ్ చేయటం ఏమిటి? వారి మధ్యన సహపంక్తి భోజనానికి కూర్చోవటం ఏమిటి? ఇలాంటి ఎన్నో నాటకీయ పరిణామాలు కనిపిస్తాయి. మంత్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి.. ఒక సాదాసీదా రైతు నేరుగా వచ్చి కలిసే వెసులుబాటు ఉండటం లాంటివెన్నో కనిపిస్తాయి.
కాస్తంత ఆగ్రహం ప్రజల్లోకనిపించినంతనే.. అవన్నీ మర్చిపోయేలా తాయిలాలు ప్రకటించటం కనిపిస్తుంది. ఇలా ఎప్పటికప్పుడు ప్రజలకు సరికొత్త అనుభవాల్ని.. అనుభూతుల్ని ఇస్తూ రాజకీయం చేయటం నేటి రాజకీయం. ఈ తరహా రాజకీయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ బాగానే వంట పర్చుకున్నారని చెప్పాలి. తాజాగా బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. అందరి నోట వావ్ అనుకునేలా చేయటమే కేటీఆర్ మేజిక్ అని చెప్పాలి.
భారీగా పెరిగిన నగర ట్రాఫిక్ తో చుక్కలు కనిపిస్తున్న నగరవాసులకు రిలీఫ్ కలిగించేలా ఫ్లైఓవర్లను ఈ మధ్యన ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలానగర్ ఫ్లైఓవర్ ను రూ.387 కోట్లతో 1.13 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఏళ్లకు ఏళ్లుగా ఉన్న ఈ డిమాండ్ ను నెరవేర్చిన క్రెడిట్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందనటంలో సందేహం లేదు. ఈ రోజు (మంగళవారం) సదరు ఫ్లైఓవర్ ఓపెనింగ్ చేశారు కేటీఆర్. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించిన ఆయన.. తనకు బదులుగా ఫ్లైఓవర్ రిబ్బన్ కంటింగ్ ను.. సదరు ఫ్లైఓవర్ పనుల్లో భాగస్వామ్యమైన మహిళా కూలీ శివమ్మ చేత రిబ్బన్ కటింగ్ చేయించారు.
వనపర్తికి చెందిన శివమ్మ రెండేళ్లుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంది. తాను రాళ్లెత్తిన నిర్మాణానికి తానే ఓపెన్ చేసే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. అయితే..ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకంలో మాత్రం ఆమె పేరు కనిపించదు. అక్కడ మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతో మంత్రి కేటీఆర్ పేరు కనిపిస్తుంది. ఇది కదా అసలుసిసలు రాజకీయం అంటే? శివమ్మ అనే కూలీ చేత ఓపెన్ చేయించిన ఘనత కేటీఆర్ కు దక్కింది. అదే సమయంలో శిలాఫలకం మీద మాత్రం ఆయన పేరే ఉంది. ఎటు చూసినా లాభం పొందటమే రాజకీయ అంతిమ లక్ష్యమన్న మాటకు కేటీఆర్ నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు కదా? ఏమైనా ఇలాంటివి తండ్రి కేసీఆర్ దగ్గర కొడుకు కేటీఆర్ బాగానే నేర్చుకుంటున్నారనే చెప్పాలి కదూ?