అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న కేటీఆర్
వివిధ దేశాలకు చెందిన ప్రధానులు.. లేదంటే కేంద్ర మంత్రులు మాత్రమే పాల్గొనే ఒక సదస్సుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. అరుదైన గౌరవంగా భావించే ఈ గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాత్రమే కావటం గమనార్హం. ప్రస్తుతం విదేశీ పర్యటన లో ఉన్న ఆయనకు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనే అవకాశం లభించింది.
గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశంలో కేటీఆర్ ను ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. కీపింగ్ పేస్ టెక్నాలజీ.. టెక్నాలజీ గవర్నెన్స్ ఎట్ క్రాస్ రోడ్స్ పేరు తో జరిగిన సమావేశం లో సెర్బియా.. పోలాండ్.. ఈస్టోనియా దేశాల ప్రధానులతో పాటు వివిధ దేశాల కేంద్రమంత్రులు మాత్రమే పాల్గొన్నారు.
ప్రపంచ నేతల్ని ఒక వేదిక మీద నుంచి తీసుకొచ్చి వివిధ అంశాలపై మాట్లాడుకునే అవకాశాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం కల్పిస్తుంది. అలాంటి వేదిక మీద ప్రసంగించే అవకాశం కేటీఆర్ కు దక్కింది. రాష్ట్ర స్థాయి లో ఆహ్వానితుడు కేటీఆర్ ఒక్కరే కావటం విశేషం. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రత్యేక బ్యాడ్జిను అందించింది.