ముఖ్యమంత్రిని తిట్టొద్దంటూ మీరు తిట్టేస్తే ఎలా కేటీఆర్?
నీతులు చెప్పటానికి.. వాటిని ఆచరించటానికి మధ్య ఉండే తేడా అంతా ఇంతా కాదు. మనం ఎవరినైనా తిట్టాలంటే వెనుకా ముందు చూసుకోకుండా తిట్టేస్తాం. అదే సమయంలో.. మనల్ని ఎవరైనా తిడుతున్నారంటే.. వారు మాట్లాడే ప్రతి మాటను గుర్తు పెట్టుకోవటమే కాదు..తిరిగి అదే రీతిలో తిట్టేయటం వల్ల విషయాన్ని పెద్దది చేసుకోవటమే తప్పించి మరింకేమీ ఉండదు. అదే సమయంలో నీతులు వల్లిస్తూ.. ఇలా దారుణానికి పాల్పడుతున్నారనుకోండి.. అంతకు మించిన తలనొప్పి వ్యవహారం మరొకటి ఉండదు.
తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు కోపం వచ్చింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కేసీఆర్ ను నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. అలాంటి వారిని ఇకపై ఉపేక్షించేది లేదన్న ఆయన.. రాజద్రోహం.. దేశ ద్రోహం కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా.. ముఖ్యమంత్రిని తిడుతున్నారంటూ.. తిట్టే వారి భాషను ప్రస్తావించిన కేటీఆర్.. ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చేందుకు తాను నోరు పారేసుకోవటం గమనార్హం.
'విపక్షాలు బఫూన్, బేవకూఫ్ మాటలు కట్టిపెట్టాలి. ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతి చిల్లరగాడూ మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో ఎవరూ తాగుతలేరా? సమాజంలో తాగడం సాధారణ విషయం. ముఖ్యమంత్రి తాగితేనే లిక్కర్ అమ్మకాలు పెరిగాయా? ఊరూపేరు లేని వ్యక్తులు కేసీఆర్‌ను దూషిస్తుంటే సహించేది లేదు. ఉద్యమ సమయంలో అప్పటి ఉద్వేగాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ మాట్లాడటంలో అర్థముంది. ఇక నుంచి మాపై చేసే విమర్శలకు పదింతలు తిరుగు సమాధానం ఇస్తాం. తెలంగాణ పురోగతి, ప్రతిష్టను దెబ్బతీసేలా ఫాల్తూ మాటలు మాట్లాడితే మహారాష్ట్రలో కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై కాంగ్రెస్ భాగస్వామ్య ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశద్రోహం కేసులు పెడతాం'అని వార్నింగ్ ఇచ్చారు.
ఇదంతా బాగానే ఉందని అనుకుందాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు చేసే వారిని తప్పు పడుతున్న మంత్రి కేటీఆర్.. తన ప్రసంగంలో మాత్రం తిట్టినోళ్లపై ఘాటు విమర్శలు చేయటం దేనికి నిదర్శనం? అని ప్రశ్నిస్తున్నారు. తనకూ డ్రగ్స్ కు సంబంధం ఉందని మాట్లాడుతున్న వాడు మనిషా.. పశువా? ఈడీకి ఎవరో ఏదో లేఖ ఇస్తే.. దానికి నాకేం సంబంధం అని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిపై అవాకులు చవాకులు పేలే వారి తీరును తీవ్రంగా తప్పు పట్టే కేటీఆర్.. తాను మాత్రం తనను విమర్శలు చేసే వారిపై ఘాటుగా రియాక్టు కావటంలో లాజిక్ ఏమిటన్న ప్రశ్న పలువురు సంధిస్తున్నారు. మరి దీనికేం చెబుతారు కేటీఆర్?