ఇద్ద‌రి చంద్రుళ్ల‌ను అస్స‌లు పోల్చొద్దంటున్నాడు

Update: 2019-02-26 05:08 GMT
ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చేసిన వేళ రాజ‌కీయం హాట్ హాట్ గా మారుతోంది. ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధిస్తున్న వైనం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. బాబుపై పీక‌ల్లోతు కోపంగా ఉన్న కేసీఆర్.. కేటీఆర్ లు త‌మ‌కు ల‌భించిన ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌టం లేదు. వేదిక ఏదైనా.. బాబును తూర్పార ప‌ట్ట‌టానికి కేటీఆర్ అస్స‌లు సంకోచించ‌టం లేదు.

ఏపీ రాజ‌కీయాల‌పై ఇటీవ‌ల కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు స్పందించ‌టం.. ముసుగులు తీసి రావాలంటూ స‌వాలు విస‌ర‌టం చేశారు. దీనిపై టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

కేసీఆర్ తో చంద్ర‌బాబుకు పోలికే లేద‌ని మండిప‌డిన ఆయ‌న‌.. త‌మ‌ను తిడుతూనే త‌మ ప‌థ‌కాల్ని చంద్ర‌బాబు కాపీ కొడుతున్నార‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబుకు.. కేసీఆర్‌ ల‌కు న‌క్క‌కు.. నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉంద‌ని.. కేసీఆర్ సొంతంగా పార్టీ పెట్టుకుంటే.. మామ పార్టీని చంద్రబాబు గుంజుకున్నాడ‌న్నారు.

ఎవ‌రో ఒక‌రితో పొత్తు లేకుండా చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌లేద‌ని.. కానీ కేసీఆర్ అందుకు భిన్న‌మ‌న్నారు. అర్థం లేని విమ‌ర్శ‌లు చేస్తున్న చంద్ర‌బాబు తీరును ఉతికి ఆరేసిన కేటీఆర్‌.. కుట్ర‌లు.. కుతంత్రాలు తెలంగాణ‌కు తెలియ‌వ‌ని.. వాట‌న్నింటికి కేరాఫ్ అడ్ర‌స్ చంద్ర‌బాబు నాయుడేన‌ని మండిప‌డ్డారు. మొత్తానికి ఇద్ద‌రు చంద్రుళ్లు అంటూ పోలిక‌లు పోల్చే వైనాన్ని కేటీఆర్ త‌ప్పు ప‌ట్ట‌ట‌మేకాదు.. ఇరువురి మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసాన్ని కేటీఆర్ తేల్చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News