ట్రంప్ తలుచుకుంటే సరిపోదంటున్న కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ - పరిశ్రమలు - ఎన్నారై శాఖా మంత్రి కేటీఆర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని వలసదారులపై కత్తికట్టేలా హెచ్1బీ వీసాల నిబంధనాల్లో పెద్ద ఎత్తున ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ ఇతర దేశాలకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులను తొలగిస్తామని డొనాల్డ్ ట్రంప్ అంటే అయి పోయేది కాదని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు మద్దతివ్వడం, చట్టసభల ఆమోదం వంటి అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. బిల్లుపై అమెరికా సెనెట్ తీర్మానం చేయడం, అక్కడి చట్టసభల్లో ఆమోదం పొందడం వంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాతే సదరు ఆదేశాలు అమలులోకి వస్తాయన్నారు. అందుకే అమెరికాలోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు - వారి కుటుంబాలు భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
కరీంనగర్ జిల్లాలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ అమెరికాలో ఉన్న విదేశీ ఐటీ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున ఉన్నది అయిన నేపథ్యంలో వీసా నిబంధనలు కలవరపాటుకు గురిచేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. త్వరలోనే ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించున్నట్లు వివరించారు. అంతేకాకుండా హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ సంస్థల ప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వెళ్లి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తో మాట్లాడతామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. తమ పరిపాలనలో సమస్యలేవీ పరిష్కారం కాలేదని కాంగ్రెస్ నేతలు విమర్శించడం చిత్రంగా ఉందన్నారు. 65 ఏళ్ల దరిద్రాన్ని తమకు అప్పగించి పోయారని, దాన్ని శుభ్రం చేసేందుకే సమయం సరిపోతోందని వ్యాఖ్యానించారు. ఒక్కొక్క సమస్యను అధ్యయనం చేస్తూ ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతున్నామని త్వరలోనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరువ అవుతాయని కేటీఆర్ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/