ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వేళయ్యింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు ముగింపు దశకు చేరుతోంది. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ ఈ మేరకు తుది జిల్లాల ప్రకటనకు రెడీ అవుతోంది.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాల వ్యవహారంలో వైసీపీ నేతలెవరూ తలదూర్చవద్దని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం వైసీపీ సర్కార్ లో సైలెంట్ గా సాగుతోంది.
వచ్చే ఏడాదిలో ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం నియమించిన కమిటీల నివేదికల ఆధారంగా కొత్త జిల్లా ప్రకటన ఉంటుందని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడించారు.
వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త జిల్లాల ప్రకటన ఉండబోతోందని డిప్యూటీ స్పీకర్ గుంటూరులో తెలిపారు.
ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి వస్తోందని.. పార్లమెంట్ నియోజకవర్గాలకు అదనంగా అతిపెద్దదైన అరకు నియోజకవర్గాన్ని కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తున్నామని కోన రఘుపతి తెలిపారు. జిల్లాల సరిహద్దులతోపాటు ఇతర అంశాలపై అధికారులు నిర్ణయం తీసుకుటున్నారని రఘుపతి వివరించారు.