కేసీఆర్ కు షాకిచ్చిన కోమటిరెడ్డి

Update: 2015-12-30 05:04 GMT
ఎవరూ మొనగాడు కాదు. ఈ మాట అంటే చాలామంది ఒప్పుకోరు. తమకు మించిన మొనగాళ్లు లేరనుకునే వారైతే.. అస్సలు ఏకీభవించరు. ఇక.. గెలుపు ధీమాతో దూసుకెళుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారైతే ససేమిరా అంటారేమో. అయితే.. గెలుపు శాశ్వితం కాదని.. దాని కోసం అనుక్షణం కష్టపడాలన్న నిజం అందరికి తెలిసివచ్చేలా చేసింది నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం.

అధికారికంగా ప్రకటించనప్పటికీ.. నల్గొండకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ ఎస్ కు పరాభవం తప్పలేదు. క్లీన్ స్వీప్ చేయాలన్న కేసీఆర్ లక్ష్యాన్ని గండికొడుతూ.. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డిని 158 ఓట్ల మెజార్టీతో ఓడించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గులాబీ బాస్ కు షాకిచ్చారు.

స్థానిక సంస్థల్లో మెజార్టీ బలం ఉన్న కాంగ్రెస్ మొదటి నుంచి గెలుపు మీద ధీమాతో ఉంది. అయితే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో.. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారన్న సందేహం ఉంది. దీనికి తగ్గట్లే కోమటిరెడ్డి ఫ్యామిలీకి షాక్ ఇవ్వాలని.. నల్గొండలో వారి అధిపత్యానికి గండి కొట్టాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ అధికారపక్షం చాలానే ప్రయత్నాల్ని చేసింది. దీనికి భిన్నంగా తుది ఫలితం రావటం గమనార్హం.
Tags:    

Similar News